Categories: LATEST UPDATES

మాల్స్ అద్దెలపై కోవిడ్ దెబ్బ

  • నాలుగో త్రైమాసికంలో 24 శాతం మేర తగ్గుదల
  • ఇక్రా నివేదికలో వెల్లడి

కరోనా మహమ్మారి దెబ్బ షాపింగ్ మాల్స్ పై ఇంకా కొనసాగుతోందని.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో వాటి అద్దె ఆదాయంలో 24 శాతం మేర తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. తొమ్మిది రాష్ట్రాల్లోని 14.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 23 షాపింగ్ మాల్స్ పై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో వివిధ రాష్ట్రాల విధించిన ఆంక్షల కారణంగా మాల్స్ లోని వ్యాపారాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయని వివరించింది. ఈ 23 మాల్స్ అద్దె ఆదాయం దాదాపు 24 శాతం మేర తగ్గిందని, ఆ మొత్తం దాదాపు రూ.400 కోట్లు అని ఇక్రా సెక్టార్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. కోవిడ్ ముందు 2020 మూడో త్రైమాసికంలో ఆ మాల్స్ అద్దె ఆదాయం దాదాపు రూ.470 కోట్లు ఉండగా.. 2020-21 తొలి త్రైమాసికంలో లాక్ డౌన్ కారణంగా అది రూ.85 కోట్లకు పడిపోయినట్టు వివరించారు. అయితే అనంతరం ఆ ఏడాది మూడు, నాలుగో త్రైమాసికాల్లో కాస్త పురోగతి కనిపించిందని.. నాలుగో త్రైమాసికంలో రూ.355 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ‘అయితే, 2021 ఏప్రిల్, మే నెలల్లో కరోనా రెండో వేవ్ కారణంగా షాపింగ్ మాల్స్ మళ్లీ మూసేయాల్సి వచ్చింది. తో 2022 తొలి త్రైమాసికంలో ఆ మాల్స్ అద్దె ఆదాయం 62 శాతం తగ్గి రూ.135 కోట్లకు చేరింది’ అని ఆమె వివరించారు.

This website uses cookies.