Categories: PROJECT ANALYSIS

కోకాపేటలో ప్రెస్టీజ్ బెవర్లీ హిల్స్

హైదరాబాద్ మోస్ట్ ప్రిఫర్ బుల్ ప్రాంతంగా మారిన కోకాపేటలో మరో భారీ ప్రాజెక్టు రానున్నది. ప్రెస్టీజ్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా బెవర్లీ హిల్స్ అనే ప్రాజెక్టును లాంచ్ చేసింది. 5.85 ఎకరాల విస్తీర్ణంలో జీ+35 అంతస్తుల్లో మూడు టవర్లు నిర్మిస్తోంది. రెరా అనుమతి లభించిన ఈ ప్రాజెక్టులో 3, 4 బీహెచ్ కే లలో మొత్తం 816 యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. 1800 చదరపు అడుగుల నుంచి 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 బీహెచ్ కే ఫ్లాట్లు.. 2700 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 బీహెచ్ కే ఫ్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ లోనే ఉండటం విశేషం. అన్ని ప్లాట్లలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా వీటిని డిజైన్ చేశారు.  అంతే కాకుండా ప్రాజెక్టులో భారీ స్థాయిలో ల్యాండ్ స్కేపింగ్ సైతం అందంగా డిజైన్ చేశారు. ధర చదరపు అడుగుకి రూ.7,200 నుంచి మొదలవుతుంది.

ప్రాజెక్టు ప్రత్యేకతలివీ..

ప్రెస్టీజ్ సంస్థ డిజైన్ చేసే క్లబ్ హౌస్ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇందులో జిమ్,   స్విమ్మింగ్ పూల్,  మినీ థియేటర్, బ్యాంకెట్ హాల్స్ వంటి వాటికి స్థానం కల్పిస్తారు. ఇక ఇండోర్ గేమ్స్ అయిన స్క్వాష్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, బిలియర్డ్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. క్రికెట్ పిచ్, బాస్కెట్ బాల్ కోర్టు వంటి వాటికి ప్రాధాన్యతనిస్తారు.

This website uses cookies.