నిబంధనల ప్రకారం ప్రాజెక్టును రెరాలో నమోదు చేయకుండా దానికి సంబంధించి ప్రచారం చేసినందుకు రెరా కన్నెర్ర చేసింది. నిబందనలు ఉల్లంఘించినందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్వెస్టర్స్ క్లినిక్ కు పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. వాస్తవానికి ఈ అంశంపై జూన్ 12న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. కానీ ఇన్వెస్టర్స్ క్లినిక్ రాకపోవడంతో నోటీసు జారీ చేసింది. నోయిడాలోని ఎం3ఎం ప్రాజెక్టు విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇన్వెస్టర్స్ క్లినిక్ కు జూన్ 3న షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు యూపీ రెరా తెలిపింది.
జూన్ 12న మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు రావాలని అందులో పేర్కొన్నట్టు వివరించింది. కానీ ఇన్వెస్టర్స్ క్లినిక్ ఆ సమయానికి విచారణకు హాజరు కాలేదని చెప్పింది. దీంతో జూన్ 17 సాయంత్రం 5 గంటల్లోగా లక్నోలోని రెరా ప్రధాన కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా ఈమెయిల్ ద్వారా వివరణ ఇవ్వాలని సూచించినట్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి జూన్ 19న తుది విచారణ జరుపుతామని పేర్కొంది. ఒకవేళ ఇన్వెస్టర్స్ క్లినిక్ ఈసారి కూడా హాజరుకాకుంటే అందుబాటులో ఉన్న ఆధారాల మేరకు ఆ సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
This website uses cookies.