ఫ్లెక్సిబు స్పేస్ ప్రొవైడర్ వీ వర్క్ ఇండియా.. మాదాపూర్ లోని రహేజాలో కొత్త వర్క్ స్పేస్ ఏర్పాటు చేయనుంది. దాదాపు లక్ష చదరపు అడుగులకు పైగా దాదాపు 1500 మంది డెస్క్ సామర్థ్యంతో దీనిని రూపుదిద్దనుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. ‘దేశంలో హైదరాబాద్ టాప్ బిజినెస్ డెస్టినేషన్ గా ఎదుగుతోంది.
పలు పెద్ద కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫీస్ లీజింగ్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నాం’ అని వీ వర్క్ ఇండియా రియల్ ఎస్టేట్ అండ్ ప్రొడక్ట్ హెడ్ అర్నవ్ ఎస్. గుసెయ్ పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ లో వుయ్ వర్క్ ఇండియాకి ఇది మూడో వర్క్ స్పేస్ కావడం గమనార్హం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్ లలోని 45 ప్రాంతాల్లో 6.5 మిలియన్ చదరపు అడుగుల వర్క్ స్పేస్ కలిగి ఉంది.
This website uses cookies.