రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతుందంటూ డెవలపర్లు చేసిన ఫిర్యాదుపై రెరా స్పందించింది. తొలుత డెవలపర్లంతా కొనుగోలుదారుల సమస్యలను నిర్దేశిత కాలంలోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. రెరా లేవనెత్తిన సందేహాలు నివృత్తి చేయడంలో విఫలం కావడంతో దాదాపు 200 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
వీటిలో లీగల్ పరమైన అంశాలతోపాటు టెక్నికల్, ఫైనాన్స్ సంబంధిత సందేహాలు, సమస్యలు ఉన్నట్టు గుజరాత్ రెరా అధికారి ఒకరు వెల్లడించారు. వీటికి సంబంధించి తాము డెవలపర్లను వివరణ కోరగా.. ఇప్పటివరకు స్పందించలేదని పేర్కొన్నారు. దాదాపు 200 ప్రాజెక్టులకు సంబంధించిన డెవలపర్లు తాము అడిగిన వివరాలు ఇవ్వలేదని తెలిపారు. అందువల్లే ఆయా ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లలో జాప్యం జరుగుతోందని వివరించారు.