బాచుపల్లిలో బడా సిటీ రూపుదిద్దుకుంటోంది. అందులో నివసించేవారికి సకల సౌకర్యాలు లభిస్తాయి. విశాలమైన రహదారులు.. జాగింగ్ ట్రాక్.. బ్యూటీఫుల్ ల్యాండ్ స్కేపింగ్.. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇక, ఆధునిక సదుపాయాలకు కొదవే లేదు. విశాలమైన క్లబ్ హౌజ్ అందరికీ స్వాగతం పలుకుతుంది. అందులోని మోడ్రన్ జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ప్రతిఒక్కర్ని ఇట్టే ఆకర్షిస్తాయి. హైదరాబాద్‌లోనే ఇంతటీ అతిపెద్ద సిటీని నిర్మిస్తోంది ఎవరో తెలుసా? వాసవి గ్రూప్. ఈ సంస్థ నుంచి జాలువారుతోన్న ప్రాజెక్టే.. అర్బన్ ( వాసవి అర్బన్ | Vasavi Urban ). ఈ ప్రాజెక్టు ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే, మీరు కచ్చితంగా ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు.
బాచుపల్లిలోనే బడా సిటీ అని అనడానికి అనేక కారణాలున్నాయి. హైదరాబాద్‌లో మూడున్నర వేలకు పైగా ఫ్లాట్లను నిర్మించిన ప్రాజెక్టుల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. పైగా, కేవలం మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో నిర్మించినవి దాదాపు లేవనే చెప్పాలి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని.. సామాన్యులకు సకల సౌకర్యాల్ని అందించాలన్న లక్ష్యంతో వాసవి గ్రూప్.. బాచుపల్లిలో వాసవి అర్బన్ అనే ప్రాజెక్టుని ప్రారంభించింది. దాదాపు 17.34 ఎకరాల్లో 12 టవర్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్ ఎత్తు 23 అంతస్తుల దాకా ఉంటుంది. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. 3,714. డెబ్బయ్ శాతం స్థలాన్ని ఓపెన్ స్పేసెస్‌గా ఉంచగా.. నిర్మాణం వచ్చేది ముప్పయ్ శాతం స్థలంలోనే.
ఒకవైపు మెట్రో రైలు.. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు.. చేరువలో అంతర్జాతీయ స్కూళ్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, అత్యవసరాల్లో ఆస్పత్రులు, ఫార్మా కార్యాలయాలు.. వంటివన్నీ ఉండటం వల్ల బాచుపల్లి హాట్ లొకేషన్‌గా మారింది. ఇక్కడ్నుంచి ముంబై, నాగ్‌పూర్ హైవేలకు సులువుగా ప్రయాణించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని కీలక నగరాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. అంతెందుకు బాచుపల్లి తర్వాత వచ్చే మల్లంపేట్ సర్వీసు రోడ్డు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే చాలు.. నగరంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా చేరుకోవచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో కట్టేవన్నీ టూ బెడ్రూమ్ ఫ్లాట్లే. అయినా, ఆధునిక సదుపాయాల్ని పొందుపర్చడంలో వెనకంజ వేయట్లేదు. క్లబ్ హౌజ్ ఏర్పాటు చేసి అందులోనే జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాల్ని కల్పిస్తోంది. ధర కూడా అందుబాటులోనే ఉంచడంతో కొనుగోలుదారులు ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి అత్యుత్తమ లొకేషన్‌లో.. అందుబాటు ధరలో ఫ్లాటు లభిస్తుంటే.. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి?
ప్రాజెక్టు పేరు: వాసవి అర్బన్
ఎక్కడ? బాచుపల్లి
ల్యాండ్ ఏరియా: 17.34 ఎకరాలు
మొత్తం బ్లాకులు: 12
బ్లాకుల ఎత్తు: 2 సెల్లార్లు + స్టిల్ట్ + 23 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 3714
ఫ్లాట్ల విస్తీర్ణం: 875, 950, 975 చ.అ.
ప్రస్తుత పరిస్తితి: 4,7,10 బ్లాకుల పునాది పూర్తి
హ్యాండోవర్ తేది: 2024 డిసెంబరు (6 నెలలు గ్రేస్ పీరియడ్)
ధర: రూ.40 లక్షల్నుంచి
కొనేవారు: ఉద్యోగులు, ప్రొఫెషనల్స్
This website uses cookies.