మహారాష్ట్రలో నిలిచిపోయిన ప్రాజెక్టులపై ఆ రాష్ట్ర రెరా దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపుగా వాటి పరిశీలన పూర్తి చేసి దాదాపు 11వేల ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటిలో ఎక్కువ ప్రాజెక్టులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే ఉన్నాయి. ముఖ్యంగా తమ ప్రాజెక్టు స్థితిని, సంబంధిత సమాచారాన్ని మహారెరాలో అప్ డేట్ చేయడంలో విఫలమైన డెవపర్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఇలాంటి అవకతవకలను తీవ్రంగా పరిగణించిన రెరా.. 10,777 ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ ల్యాప్స్ అయిన ప్రాజెక్టులు మే 2017 నుంచి తమ వద్ద రిజిస్టర్ అయినట్లు తెలిపింది. 30 రోజుల్లోగా నోటీసులపై స్పందించకుంటే ఫ్లాట్ల అమ్మకాలపై ఆంక్షలు, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పాటు ఈ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేస్తామని హెచ్చరించింది. ల్యాప్స్ అయిన ప్రాజెక్టుల డెవలపర్లు ఫారమ్-4తో కూడిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించాలని లేదా ప్రాజెక్టు గడువు పొడిగింపు కోరాలని సూచించింది. మరోవైపు తప్పు చేసిన డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రెరా నిర్ణయించింది. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్‌ను నేరుగా నిలిపివేయడం లేదా రద్దు చేయడం, శిక్షార్హమైన చర్యలను విధించడం, అలాంటి ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల కొనుగోలు, విక్రయాలను నమోదు చేయొద్దని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేయాలని యోచిస్తోంది.
This website uses cookies.