Categories: TOP STORIES

రెసిడెన్షియల్‌ డిమాండ్‌ పైకి

బిజినెస్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ సిటీకి ప్లస్ పాయింట్

స్టార్టప్స్‌.. స్మాల్‌, మీడియం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..

నగరంలో జాబ్స్‌పెరిగి ఇళ్లకు డిమాండ్‌..

నగరాభివృద్ధికి గవర్నమెంట్ పాలసీలు..!

కోవిడ్‌ తర్వాత హైద్రాబాద్‌లో ఇళ్లు కొనేవారి సంఖ్య అనుహ్యంగా పెరిగింది. వందల సంఖ్యలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉండటంతో సిటీ రెసిడెన్షియల్‌ ల్యాండ్ స్కేప్‌ పిక్చర్ కూడా మారిపోయింది. 2015 నుంచి 2024 మధ్యలో కొత్త ప్రాజెక్ట్‌లు ఏకంగా 65 శాతానికి పెరిగాయ్‌. పదేళ్లలో ఈ రేంజ్‌లో డిమాండంటే మాటలు కాదు. ఈ గ్రోత్‌ హైద్రాబాద్‌లో ఇళ్లకున్న డిమాండ్‌ను తెలపడంతో పాటు.. ఇండైరెక్ట్‌గా డిమాండ్‌కు తగ్గట్టే నగరంలో ఇళ్ల లభ్యత ఉందని.. సప్లై వియమంలో ఢోకా లేదని చెప్పకనే చెబుతోంది.

హైద్రాబాద్‌- ఆ పేరుతో పాటు.. ఇక్కడి వాతావరణంలో ఓ వైబ్‌ ఉంటుందేమో..! ఒక్కసారి సిటీకి వచ్చి కొన్ని రోజులు గడిపితే చాలు మళ్లీ వెళ్లబుద్ధి కాదు. అందుకే చదువు, ఉపాధి, ఉద్యోగం అవసరమేదైనా- వచ్చిన వారంతా నగరంలోనే స్థిర పడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే హైద్రాబాద్‌లో ఇళ్లకు ఎప్పటికప్పుడు డిమాండ్‌ పెరుగుతూ పోతుంది. కంఫర్టబుల్‌గా అనిపించే సిటీ లైఫ్‌స్టైల్‌, వివిధ రాష్ట్రాలు- ప్రాంతాల నుండి వచ్చిన వారితో కనిపించే భిన్న సంస్కృతులు, హైద్రాబాద్‌కు మాత్రమే సొంతమైన నవాబీ రుచులు.. లోకల్‌, దేశీ రుచులతో అలరించే ఫుడ్‌, అందర్ని కలుపుకుపోయే పండగలు, భౌగోళిక వాతావరణ పరిస్థితులు, వివిధ భాషలు మాట్లాడే వారితో వైబ్రెంట్‌ కల్చర్‌ కనిపిస్తుందిక్కడ.

అంతేనా హై క్లాస్ హెల్త్‌కేర్‌ సదుపాయాలు, ఉన్నత విద్యా సంస్థలు, టాప్‌ క్లాస్‌ ప్రొఫెషనల్‌ అండ్ స్కిల్ డెవలప్మెంట్‌ ఇనిస్టిట్యూషన్స్‌, సేఫ్‌ అర్బన్‌ ఎకో సిస్టమ్‌, మౌలిక సదుపాయాలు ఇవన్నీ హైద్రాబాద్‌ను అన్ని వర్గాల వారికి దగ్గర చేసేవే. అందుకే ఇక్కడ నివసించాలనుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడూ పెరుగుతోంది. ఈ కారణంతోనే దేశ- విదేశీ సంస్థల్ని ఆకర్షిస్తూ గ్లోబల్‌ డెస్టినీగా మారుతోంది హైద్రాబాద్‌.

వివిధ రంగాల నిపుణులు, కార్మికులు అందుబాటులో ఉండటం మరో అడ్వాంటేజ్‌ హైద్రాబాద్‌కి. నచ్చిన సబ్జెక్ట్‌ చదువుకోడానికి కావాల్సినన్నీ విద్యా సంస్థలు, యూనివర్శిటీలు. ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్‌, బయో టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాలకు హబ్‌గా మారుతుండటంతో వివిధ రకాల ప్రొఫెషనల్స్‌కి ఇక్కడ కావాల్సినన్నీ అవకాశాలున్నాయ్‌. రంగం ఏదైనా ఎక్స్‌పర్ట్స్‌కి కొదవ లేకపోవడం అంతర్జాతీయ సంస్థల్ని హైద్రాబాద్‌ వైపు చూసేలా చేస్తోంది. బిజినెస్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉండటం, స్టార్టప్స్‌.. స్మాల్‌, మీడియం పరిశ్రమలకు కావాల్సినంత ప్రొత్సాహాకాలు లభించడం.. ఇంటర్నేషనల్‌ కంపెనీలు విస్తరిస్తుండటంతో జాబ్స్‌పెరిగి ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది నగరంలో.

అదే సమయంలో హైద్రాబాద్‌లో ధనవంతుల గ్రాఫ్‌ కూడా ఏటికేడు పైకెళుతోంది. హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్ పెరగడంతో ప్రీమియం, లగ్జరీ హౌసింగ్‌ కేటగిరీల్లో డిమాండ్‌ కనిపిస్తోంది. ఇక రాజకీయ సుస్థిర వాతావరణం, గవర్నమెంట్స్‌ తీసుకొంటున్న నిర్ణయాలు, పాలసీలు అన్నీ నగరాభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటుండంతో విదేశీ పెట్టుబడులు సైతం వెల్లువలా వస్తున్నాయ్‌. FDIల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రెండు మూడింతల రిటర్న్స్‌ వస్తుండటంతో విదేశీ కంపెనీలు నగరంలో చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం.. మరింత విస్తరిస్తుండటం కూడా ఉపాధి అవకాశాల్ని పెంచేలా చేస్తోంది. ఇవన్నీ కలిసి హైద్రాబాద్ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ డిమాండ్‌ను అమాంతం పెంచుతున్నాయ్‌.

This website uses cookies.