మనదేశ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాప్ టెక్ విభాగం మార్కెట్ పరిమాణం దినదినాభివృద్ధి చెందుతోందని, 2047 నాటికి ఇది 600 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని క్రెడాయ్, ఈవై సంయుక్త నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం రియల్ మార్కెట్ లో ప్రాప్ టెక్ పరిమాణం 10.5 బిలియన్ డాలర్లు ఉండగా.. 2047 నాటికి ఏకంగా 600 బిలియన్ డాలర్లకు చేరడం అసాధ్యమేమీ కాదని వ్యాఖ్యానించింది. అలాగే దేశంలో రియల్ రంగం పరిమాణం ప్రస్తుతం 300 బిలియన్ డాలర్లు ఉండగా.. 2047 నాటికి అది 4.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.
2047లో నిర్దేశిత 26 లక్షల కోట్ల జీడీపీ లక్ష్యంలో ఇది 18 శాతం అని పేర్కొంది. ఇప్పటివరకు సంప్రదాయక పాత్రగా ఉన్న ప్రాప్ టెక్ రియల్ రంగంలో కీలక వృద్ధి డ్రైవర్ గా మారిందని, ప్రాప్ టెక్ ఏకీకరణ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని నివేదిక తెలిపింది. అంతేకాకుండా ఆటోమేషన్ క్రమబద్ధీకరించడం, ఖర్చులు తగ్గించడం, రియల్ రంగ మార్జిన్లను మెరుగుపరచడం వంటి అంశాలు ప్రాప్ టెక్ కారణంగా జరుగుతాయని వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం) వంటి ఆవిష్కరణలు రియల్ కార్యకలాపాలలో విప్లవాత్మక మార్పులు, సామర్థ్యాన్ని పెంచడంతోపాటు స్తిరాస్థి విలువను పారదర్శకంగా నిర్ధారిస్తున్నాయని తెలిపింది.
ఇంతలో, 13,000 మందికి పైగా సభ్యులతో కూడిన డెవలపర్స్ బాడీ కూడా సరసమైన గృహాల నిర్వచనంలో మార్పు తీసుకురావాలని, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మరియు జోనింగ్ మరియు క్రమబద్ధీకరించిన భూ సేకరణ విధానాల ద్వారా భూమిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరింది.
This website uses cookies.