Categories: TOP STORIES

ముంబై లో రూ.50 లక్షలతో ఇల్లు వస్తుందా?

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ ప్రాపర్టీ కొనడానికి రూ.50 లక్షలు సరిపోతాయా? అసలే రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత ఖరీదైన నగరంగా ప్రసిద్ధికెక్కిన ముంబైలో ఈ మొత్తంతో చిన్న ఫ్లాట్ అయినా వస్తుందా? దీనికి సమాధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మరి మనం రూ.50 లక్షలు పట్టుకుని ముంబై వెళ్లే ఏం వస్తాయో చూద్దామా?

ముంబైలోని అత్యంత డిమాండ్ ఉనన ప్రాంతాల్లో పార్కింగ్ స్థలం కొనుగోలు చేయడానికి రూ.50 లక్షల బడ్జెట్ సరిగ్గా సరిపోతుంది. అయితే.. ప్రాంతం, డెవలపర్ ని బట్టి ఈ రేటు కాస్త మారే అవకాశం ఉంది. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అనేక లగ్జరీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇందులో పార్కింగ్ స్థలం రూ.25 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటాయి. దక్షిణ ముంబైలోని విహార ప్రదేశం అయిన వర్లీ సీ ఫేస్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్ 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 బీహెచ్ కే అపార్ట్ మెంట్ కు రూ.125 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

దీనికి గరిష్టంగా ఆరు పార్కింగ్ స్థలాలు ఒక్కోటీ రూ.50 లక్షల చొప్పున లభిస్తాయి. డెవలపర్లు కార్ పార్కింగ్‌ను విడిగా విక్రయించరు. అయితే ఫ్లాట్ మొత్తం ధరలో వాటిని కూడా చేరుస్తారు. రూ.100 కోట్ల ధర కలిగిన 5వేల చదరపు అడుగుల అపార్ట్ మెంట్ లో నాలుగు కార్ పార్కింగ్‌లు ఉంటాయి. కొన్ని చోట్ల ప్రీమియం ఆఫీస్ ప్రాజెక్టుల్లో కారు పార్కింగులు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల ధరలోపు వస్తాయి. వాస్తవానికి మహారెరా నిబంధనల ప్రకారం డెవలపర్లు, ఓపెన్ పార్కింగ్ ప్రాంతాలను విక్రయించడానికి, కేటాయించడానికి వీల్లేదు. అయితే, కవర్ పార్కింగ్ విషయంలో డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి నిర్దేశిత మొత్తం వసూలు చేయొచ్చు.

This website uses cookies.