Categories: LEGAL

రోబో ఇసుకకూ మామూలు ఇసుక వ్యాటే

  • కర్ణాటక హైకోర్టు స్పష్టీకరణ

కర్ణాటక వ్యాట్ చట్టం-2003 ప్రకారం కృత్రిమ తయారీ ఇసుక (ఎం-శాండ్) కూడా మామూలు ఇసుక ఎంట్రీ కిందకే వస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.సుజాత నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కర్ణాటక వ్యాట్ చట్టం షెడ్యూల్-3లోని 83వ ఎంట్రీ మేరకు ఎం-శాండ్ పై 5 శాతం, 5.5 శాతం వ్యాట్ విధిస్తున్నారు. అయితే, 2015 మార్చి 31న ఎం-శాండ్ వ్యాట్ ను 5.5 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కానీ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకు జరిగిన లావాదేవీలపై ఎం-శాండ్ వ్యాట్ 14.5 శాతం చొప్పున చెల్లించాలంటూ ఈ ఇసుకను రోబో శాండ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న బెంగళూరుకు చెందిన రోబో సిలికాన్ ప్రైవేట్ లిమిటెడ్ కు రాష్ట్ర ఆర్థికశాఖ నోటీసులిచ్చింది.

వీటిని ఆ సంస్థ కర్ణాటక అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసింది. 2019 జనవరి 3న సంస్థకు అనుకూలంగా తీర్పు వెలువడింది. వ్యాట్ చట్టంలోని 83వ ఎంట్రీ కిందకు ఎం-శాండ్ రాదని పేర్కొంది. దీనిపై సదరు సంస్థ హైకోర్టుకు వెళ్లగా.. తమ ముందు ఉంచిన రికార్డులు, ఇతరత్రా వివరాల ప్రకారం మామూలు ఇసుక, ఎం-శాండ్ చాలా విషయాల్లో సారూప్యత కలిగి ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎం-శాండ్ సైతం వ్యాట్ చట్టం షెడ్యూల్ 3లోని 83 ఎంట్రీ కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

This website uses cookies.