తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు వేర్వేరు రియల్ ఎస్టేట్ సంస్థల్లో రూ.75 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. నవంబర్ 10న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్ లలోని 30 చోట్ల నిర్వహించిన దాడుల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపింది. ఈ దాడుల్లో రూ.1.20 కోట్ల నగదు, రూ.90 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా లెక్కల్లోకి చూపని ఆదాయినికి సంబంధించి డిజిటల్ రికార్డులు, పుస్తకాలు, నగదు లావాదేవీలు నమోదు చేసి ఉన్న కాగితాలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. ఆయా సంస్థలు జరిపిన నగదు లావాదేవీలను అకౌంట్ పుస్తకాల్లో నమోదు చేయలేదని వివరించింది.
This website uses cookies.