Categories: LATEST UPDATES

తాగునీటికి రూ.1200 కోట్లు మంజూరు

ఓఆర్ఆర్ పరిధలోని కొత్త మున్సిపాల్టిటీలు, గ్రామ పంచాయతీల్లో నివసించే ప్రజల దాహార్తీని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుమారు రూ.1200 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ జీవో విడుదల చేశారు. 2036 సంవత్సరం నాటికి ఈ ప్రాంతాల్లో జనాభా సుమారు 33.92 లక్షలకు చేరుకుంటుందనే అంచనా వేసి.. వారి తాగునీటి అవసరాల్ని తీర్చేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం సుమారు 2100 కిలోమీటర్ల మేరకు అదనపు పైపు లైన్లను ఏర్పాటు చేస్తారు. అదనంగా సర్వీస్ రిజర్వాయర్లను నిర్మిస్తారు.

ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఏర్పాటైన ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ కొత్త కాల‌నీలు పుట్టుకొస్తున్నాయి. అనేక నిర్మాణ సంస్థ‌లు కొత్త ప్రాజెక్టుల్ని క‌డుతున్నాయి. మ‌రి, వీటిలో నివ‌సించేవారు తాగ‌టానికి మంచినీరు అవ‌స‌రం క‌దా.. పైగా, ఇప్ప‌టికే ప‌లు నివాసితుల సంక్షేమ సంఘాలు ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాయి. మిషన్ భగీరథ కార్యక్రమాలతో సమానంగా తమ కాలనీలకు నీటి సరఫరా అంద‌జేయాల‌ని కోరాయి. దీంతో, ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నది.

This website uses cookies.