‘రుస్తోంజీ’ బ్రాండ్ తో ప్రాపర్టీలు విక్రయిస్తున్న కీస్టోర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు బుధవారం ఎన్ఎస్ఈలో ఒక్కొక్కటి రూ.555 చొప్పున లిస్టయ్యాయి. ఐపీఎ ఇష్యూ ధర రూ.541తో పోలిస్తే ఈ ప్రీమియం 2 శాతం కంటే కాస్త ఎక్కువ. బీఎస్ఈ లో కీస్టోన్ షేర్లు రూ.555 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. పబ్లిక్ ఇష్యూ ఆఫర్ లో 86,47,858 షేర్లకు 1,73,72,367 బిడ్లు వచ్చాయి. కీస్టోన్ రియల్టర్స్ ఐపీఓ రూ.560 కోట్ల వరకు తాజా ఇష్యూ, రూ.75 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ కలిగి ఉంది. ప్రారంభ షేరు విక్రయం ధర షేరుకు రూ.514-రూ.541గా నిర్ణయించారు.
కీస్టోన్ రియల్టర్లు యాంకర్ పెట్టుబడిదారుల నుంచి రూ.190 కోట్లకు పైగా వసూలు చేశారు. 16 యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కొక్కటి రూ.541 చొప్పున 35.21 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించాలని కంపెనీ నిర్ణయించింది. అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ అథార్టీ, మోర్గాన్ స్టాన్లీ, సెయిట్ క్యాపిటల్ యాంకర్ ఇన్వెస్టర్ పోర్షన్ లో దాదాపు 35 శాతం వాటా కలిగి ఉన్నాయి. యాంకర్ ఇన్వెస్టర్ పోర్షన్ లో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్ సీ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కూడా పాల్గొన్నాయి. ఎస్ బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా యాంకర్ ఇన్వెస్టర్లలో భాగంగా ఉన్నాయి.
This website uses cookies.