రాష్ట్ర ప్రభుత్వం కేవలం పశ్చిమ హైదరాబాద్ మీదే కాకుండా.. నగరంలోని అన్ని వైపులా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తోంది. ఫలితంగా, బహుళజాతి సంస్థలు నగరంలో తమ కార్యకలాపాల్ని ఆరంభిస్తూ కొత్త ఉద్యోగుల్ని నియమిస్తున్నాయి. దీంతో, ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వివిధ నగరాలకు చెందిన ప్రజలూ హైదరాబాద్ విచ్చేస్తున్నారు. ఈ ఒక్క కారణం వల్ల.. మిగతా నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆర్వీ నిర్మాణ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చైత్ర చెరుకు తెలిపారు. 2023లో రియల్ రంగం మెరుగైన రీతిలో పయనిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే..
2022లో రెండు మరియు మూడో త్రైమాసికల్లో మార్కెట్ నెమ్మదించిందని.. కొనుగోలుదారులు వేచి చూసే ధోరణీని అవలంభించారని వివరించారు. ఆ తర్వాత స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని స్థిర నిశ్చయంతో ఉన్నవారే 2022 చివరి త్రైమాసికంలో తమ ప్రాజెక్టులను సందర్శించారని.. ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్లో మెరుగ్గా జరిగాయని తెలిపారు. 2021తో పోల్చితే ఈ ఏడాది నిర్మాణ వ్యయం సుమారు 20 నుంచి 25 శాతం పెరిగింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం వంటివి నిర్మాణ సామగ్రి సరఫరా వ్యవస్థను దెబ్బతీశాయి. ఫలితంగా ధరలు ఉవ్వెత్తున పెరిగాయి. అదే సమయంలో భూముల ధరలూ అధికమయ్యాయి. నైపుణ్యమున్న నిర్మాణ కార్మికుల సిబ్బంది కొరత ఏర్పడింది. అందుబాటులో ఉన్న కార్మికుల వేతనాల్ని పెంచేశారు. ఫలితంగా, నగరంలో ఫ్లాట్ల ధరలూ పెరిగాయి.
హైదరాబాద్‌లోని అన్నీ ప్రీమియం లొకేషన్లలో మేం ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాం. గత ముప్పయ్యేళ్లుగా మా సంస్థ వ్యూహాత్మక ప్రాంతాల్లోనే ప్రాజెక్టుల్ని చేపట్టింది. నాణ్యమైన నిర్మాణాల్ని అందుబాటులో ధరలోనే కొనుగోలుదారులకు అందించిన ఘనత మా సంస్థకే దక్కుతుంది. ఈ ఏడాదిలోని కొన్ని త్రైమాసికాల్లో.. మార్కెట్ మందకోడిగా ఉన్నప్పటికీ, మా ప్రాజెక్టుల్లో ఎక్కడా అమ్మకాలు తగ్గలేదు. ఊహించిన దానికంటే ఎక్కువ ఫ్లాట్లను విక్రయించాం.
నగరంలో ప్రస్తుతం చేస్తున్న ఆరు ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ స్థాయిలో ఉన్నాయి. టీఎస్పీఏ జంక్షన్ వద్ద ఆర్‌వీ సొంవ్రిత ప్రీమియం విల్లా కమ్యూనిటీ పూర్తయ్యింది. ఇందులో విల్లాలు కొనగానే గృహప్రవేశం చేయవచ్చు. బండ్లగూడ జాగీర్‌లో ఆర్‌వీ అక్షోభ్య నిర్మాణం పూర్తయ్యింది. ఇందులో ఫ్లాట్లు కొన్నవారు జీఎస్టీ కట్టక్కర్లేదు. జీడిమెట్లలో ఆర్‌వీ ఆద్విక్ టూ బెడ్రూమ్ అపార్టుమెంట్లో కేవలం కొన్ని ఫ్లాట్లే అమ్మకానికి ఉన్నాయి. మియాపూర్‌లో నాలుగున్న ఎకరాల్లో ఆరంభించిన హైరైజ్ ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశలో ఉంది. సుమారు ఇరవై ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈస్ట్ హైదరాబాద్లోకి అడుగుపెట్టాం. కర్మాన్ ఘాట్‌లో ఆర్వీ ఉద్దీప్త అనే హైరైజ్ లగ్జరీ ప్రాజెక్టును ప్రారంభించాం. కొండాపూర్‌లో ఆర్‌వీ విభూమన్ అనే ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టును అతి త్వరలో ఆరంభించనున్నాం.
హైదరాబాద్ నిర్మాణ రంగానికి 2023 మెరుగ్గానే ఉంటుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో గృహప్రవేశానికి సిద్ధంగా ఉండే ప్రాజెక్టులకు మంచి గిరాకీ ఉంది. మా వద్ద అంత పెద్ద స్థాయిలో ఇన్వెంటరీ లేదు. కొండాపూర్‌లోని ఆర్‌వీ విభూమన్ ప్రాజెక్టుకి రెరా అనుమతి లభించింది. అతిత్వరలో ఈ ప్రాజెక్టును ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తుక్కుగూడ చేరువలోని రావిర్యాల్‌లో ఇరవై ఎకరాల్లో విల్లా ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం. మియాపూర్‌లో సెకండ్ ఫేజ్ అపార్టుమెంట్లను ఆరంభించాలనే ప్రణాళికలూ ఉన్నాయి.
This website uses cookies.