భారతీయ రియల్ మార్కెట్ లో ఎన్నారైలు అత్యంత ముఖ్యమైన కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు. ప్రస్తుతం చాలామంది ప్రవాస భారతీయులు విదేశాల నుంచి స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. భారతీయ రియల్ రంగం లాభదాయకంగా ఉన్న సంగతి వారికి తెలిసిన నేపథ్యంలో స్వదేశంలో ఎలాంటి ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతారు? వారి ప్రాధాన్యతలేమిటో చూద్దామా?
అప్పట్లో చాలామంది డెవలపర్లు ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ‘ఎన్నారై ప్రాజెక్టులు’ లాంచ్ చేసి విక్రయించేవారు. ఎన్నారైలు మాత్రమే ఇల్లు కొనే ప్రాజెక్టు ఒకటి అయితే.. తమ పొరుగువారు కూడా అంతే హై ప్రొఫైల్డ్ వ్యక్తులే ఉంటారనే భావన కలిగించేలా డెవలపర్లు వాటిని మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయించేవారు. అప్పట్లో ఇంటర్నెట్ సరిగా లేకపోవడంతో ఇక్కడ ఏమి జరుగుతుందో ఎన్నారైలకి తెలిసేది కాదు. ఫలితంగా ఎక్కువ ధర పెట్టి ఎన్నారై ప్రాజెక్టులో ఇల్లు కొనుక్కునేవారు. అయితే, ప్రస్తుతం ఎన్నారై ప్రాజెక్టుల విధానం విఫలమైంది.
ప్రస్తుతం ఎన్నారైలు చాలామంది యువత కావడం.. వారికి టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహన ఉండటంతో భారత రియల్ మార్కెట్లో ఏం జరుగుతోందో అక్కడి నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నారు. డెవలపర్ల జిమ్మిక్కులను పసిగట్టగలుగుతున్నారు. 2023లో గృహాల కొనుగోలులో పెద్ద పాత్ర పోషించబోయే ఎన్నారైలు ఎలాంటి ఇళ్ల కోసం చూస్తున్నారో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది.
ఎన్నారైలు స్వదేశంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మూలధన విలువ లేదా అద్దె ఆదాయం కోసం ప్రాపర్టీ కొనడం ఒకటైతే.. స్వదేశానికి వచ్చిన తర్వాత వ్యక్తిగత వినియోగం కోసం రెండోది. ప్రస్తుతం ఎన్నారైలు పెద్ద, మంచి ప్రాజెక్టుల్లోనే ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. 2023లో కూడా ఇదే కొనసాతుందని చెప్పొచ్చు.
This website uses cookies.