Categories: AREA PROFILE

కిస్మత్ పూర్ లో ఆర్వీ సంవ్రిత‌

  • రూ.4 కోట్లకే సూపర్ లగ్జరీ విల్లా

హైదరాబాద్ లో కోకాపేట తర్వాత అంతే స్థాయిలో గ్రోత్ ఉన్న ప్రాంతం ఏదైనా ఉందా అంటే కిస్మత్ పూర్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ లో ఇది సరికొత్త బిజినెస్ డిస్ట్రిక్ట్ గా అవతరిస్తోంది. ఆకాశహర్మ్యాలు అభివృద్ధి చేయడానికి అనుకూలమైన ఏరియా. అంతేకాకుండా బడా సైజు అపార్ట్ మెంట్ ధరకు సూపర్ లగ్జరీ విల్లా వస్తుంది. అలాంటి కిస్మత్ పూర్ లో రెడీ టూ ఆక్యుపై ప్రాజెక్టు.. ఆర్వీ సంవ్రిత. మొత్తం 10.267 ఎకరాల స్థలంలో 3 బీహెచ్ కే ప్లస్ మీడియాతో రూమ్ తో కూడిన 118 విల్లాలు ఉన్నాయి. 238, 245, 254, 260 చదరపు గజాల్లో విల్లాలను నిర్మించారు. ప్రాజెక్టు పూర్తయి, ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది.

ఓఆర్ఆర్ నుంచి కేవలం కిలోమీటరు దూరంలోనే ఈ ప్రాజెక్టు ఉండటం గమనార్హం. అప్పా జంక్షన్ నుంచి కేవలం 4 లేదా ఐదు నిమిషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. అత్తాపూర్ కు కూడా దగ్గర ఉండటం వల్ల ఇది చాలా చక్కని లొకేషన్. చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రీనరీ కూడా చాలా ఎక్కువ. హిమాయత్ సాగర్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాలుష్యం లేని ఏరియా అని చెప్పొచ్చు.
నిర్మాణ నిబంధనలను పక్కాగా పాటిస్తుందని పేరున్న ఆర్వీ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఆ ప్రాంతంలో ఇటాలియన్ మార్బుల్ తో నిర్మించిన ప్రాజెక్టు ఇది ఒక్కటేనని ఆర్‌వీ నిర్మాణ్ సంస్థ ఎండీ రామచంద్రారెడ్డి వెల్లడించారు. పైగా అన్ని ఖర్చులూ కలుపుకొంటే ఇక్కడ విల్లా కేవలం రూ.4 కోట్లకే సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం 238 గజాల్లో 2879 చదరపు అడుగుల్లో నిర్మించిన విల్లాలతోపాటు 245 గజాల్లో 2925 చదరపు అడుగుల్లో నిర్మించిన విల్లాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వెంటనే ప్రాజెక్టు సందర్శించి మీ విల్లాను రిజర్వు చేసుకోండి.

This website uses cookies.