Categories: Celebrity Homes

షారూక్ ఖాన్ బంగ్లా చాలా ఇష్టం

  • ఆస్పిరెంట్స్ ఫేమ్ సన్నీ హిందుజా
    అలియాస్ సందీప్ భయ్యా

రియల్ ఎస్టేట్ గురు డ్రీమ్ హోమ్ సెగ్మెంట్ లో ఆస్పిరెంట్స్ ఫేమ్ , ఓటీటీకి ఎంతో సహకారంతోపాటు, ప్రేక్షకులను ఆకర్షించే చిరస్మరణీయ ప్రదర్శనలను అందించిన సన్నీ హిందుజా గురించి తెలియజేస్తున్నాం. తన ఇంటికి సంబంధించి ఆయన బోలెడు సంగతులు పంచుకున్నారు. ‘నేను ఇండోర్ లో పుట్టి పెరిగాను. నాలుగో అంతస్తు తర్వాత పైకి ఎక్కితే అక్కడ మాకు ఓ గది ఇచ్చారు. అదే నా చిన్ననాటి నివాసం.

అక్కడ ఓ వరండా కూడా ఉండేది. ఎవరైనా చుట్టాలు వస్తే ఓపెన్ గా ఉండే ఆ వరండాలోనే అందరం పడుకునేవాళ్లం. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. మాకు వంటగది లేదు. మా నాన్నగారు వంట చేసేందుకు వీలుగా ఓ ఏర్పాటు చేశాం. మాకు ఎలాంటి విలాసాలు లేవని ఏనాడూ బాధపడలేదు. ఎందుకంటే మా కుటుంబం చెక్కుచెదరకుండా కలసి ఉండటమే అందుకు కారణం’ అని దేశమంతా సందీప్ భయ్యా అని పిలుచుకునే సన్నీ హిందుజా వెల్లడించారు.

డెకర్ విషయంలో సన్నీ కూడా మినిమలిస్ట్ విధానం వైపు మొగ్గ చూపించారు. ‘కచ్చితంగా నాకు ఇష్టమైన కొన్ని వస్తువులను స్టోర్ నుంచి తీసుకొచ్చి అలంకరించగలను. కానీ కొన్ని సింపుల్ డిజైన్ల ద్వారానే మన స్పేస్ ను అందంగా అలంకరించుకోవచ్చు. చక్కని ఆర్ట్ వర్క్ కోసం మార్కెట్ కు వెళ్లండి. కొన్నసార్లు నా సృజనాత్మకతను పరీక్షించుకోవడాన్ని ఇష్టపడతాను. నా వ్యక్తిగత శైలిని ప్రదర్శించడం, ఎలక్ట్రిక్ ఇంటీరియర్స్ తో ముందుకెళ్లడం నాకు చాలా ఇష్టమైన అంశాలు’ అని వివరించారు. బంగ్లాల గురించి చెబితే ఆయన విస్మయం వ్యక్తం చేస్తారు. ఆయనకు తక్కువ నిర్వహణ, ఓపెన్ కాన్సెప్ట్ జీవితాన్ని మాత్రమే అనుభవించాలని చూస్తున్నారు.

‘ఓపెన్ కాన్సెప్ట్ అయితే సహజమైన కాంతి ధారాళంగా వస్తుంది. మొక్కలు పెంచుకోవచ్చు. బాగీచా ఏక్ సోనే పే సుహాగా హో జాతా హై. తక్కువ అంతస్తులు ఉంటే నాకు, నా భార్యకు వాటిని శుభ్రం చేయడం కూడా తేలిక అవడమే కాకుండా తక్కువ సమయం పడుతుంది. షారుక్ ఖాన్ కు ఉన్నటువంటి బంగ్లా ఉండాలని నేను కలలు కంటున్నా. సముద్రానికి ఎదురుగా ఉండే బంగ్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే మీ ప్రతికూల శక్తులన్నింటినీ అది తొలగిస్తుంది. నేను కూడా నా పెరట్లో మరింత పచ్చని స్థలం, ప్రైవసీ ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ కూర్చుని ఓ చాయ్ తాగుతూ.. మంచిగా ఉందా అని ప్రశ్నించుకుంటాను. షూటింగ్ లేనప్పుడు దేవుడి మందిరంలోనే నన్ను చూస్తారు. అక్కడ ఆత్మ పరిశీలన చేసుకుంటూ కనిపిస్తాను’ అని పేర్కొన్నారు.

సన్నీ హిందుజా బాల్యంలో షారూక్ ఖాన్ ఓ భాగం. ఆయన బంగ్లా సన్నీ ని బాగా ఆకర్షించేది. ‘అదో హెరిటేజ్ బంగ్లా. ఒక విశాలమైన భవనం. నేను కల కన్న విధంగా అది సముద్రానికి ఎదురుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల నుంచి ఆయన భార్య సేకరించిన నియో క్లాసికల్ ఎలిమెంట్స్, ఆర్ట్ వస్తువులతో అందంగా ఉంటుంది. నేను అనురాగ్ కశ్యప్ ఇంటికి వెళ్లాను. అతని దగ్గర చాలా ఆకర్షణీయమైన డీవీడీ సేకరణ ఉంది. నేను కూడా నా కలల సౌథంలో వాటిని చేర్చాలనుకుంటున్నా. ఇక ప్రపంచ సినిమా కోసం ఓ గోడను పూర్తిగా అంకితం చేశారు’ అని సన్నీ వివరించారు.

This website uses cookies.