ఢిల్లీలో రికార్డు స్థాయిలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు
నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు.. కానీ ఆ ప్రాజెక్టులోని మొత్తం 1113 యూనిట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అది కూడా కేవలం మూడే రోజుల్లో. వీటి మొత్తం విలువ రూ.7,200 కోట్ల పైమాటే. లగ్జరీ ఇళ్లకు ఉన్న డిమాండ్ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ గురుగ్రామ్ లోని శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో ఏడు టవర్లతో డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులోని అన్ని 4 బీహెచ్ కే ఫ్లాట్లు, పెంట్ హౌస్ యూనిట్లు అమ్ముడైపోయాయని డీఎల్ఎఫ్ ప్రకటించింది. విక్రయాలు ప్రారంభించిన మూడు రోజుల్లోనే అన్నీ అమ్ముడైపోయాయని పేర్కొంది. కాగా, గతేడాది కూడా రూ.100 కోట్ల విలువైన 1100 యూనిట్లను కూడా డీఎల్ఎఫ్ ఇలాగే మూడు రోజుల్లోనే విక్రయించింది.