poulomi avante poulomi avante

నెలసరి ఈఎంఐకే.. నచ్చిన ప్లాటు..

హైదరాబాద్లోని ద మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్లో.. మీకు నచ్చే ప్లాటు కొనాలని చూస్తున్నారా? అయితే ప్రస్తుత పరిస్థితిలో మీరు ఎక్కువగా సొమ్ము ఖర్చు పెట్టలేరా? అయినా, మీరేం దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే, భాగ్యనగరంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు..

  • సులువుగా సొంతింటి కల సాకారం
  • ఫార్మా కారిడార్ చేరువలో ఆహ్లాద‌క‌ర క‌మ్యూనిటీ
  • 75 ఎకరాల్లో సమూహా వారి సొంతిల్లు
  • గ‌జం ధ‌ర‌.. రూ.6,500 మాత్ర‌మే
  • బుకింగ్ ఏమౌంట్‌.. రూ. ల‌క్ష


సమూహా ప్రాజెక్ట్స్ ఓ మహత్తరమైన అవకాశాన్ని మీ ముంగిట్లోకి తెచ్చింది!! ఈఎంఐ కడితే చాలు.. మీ కుటుంబం మొత్తానికి నచ్చే ప్లాటును సొంతం చేసుకోవచ్చు. సామాన్యులు, వేతనజీవులు, మధ్యతరగతి ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ప్రాజెక్టు లొకేషన్ గురించి తెలుసుకుంటే మీరు ఎగిరి గంతేస్తారు.

ప్ర‌జ‌ల‌కేం కావాలో తెలుసుకుని అందుకు త‌గ్గ‌ట్టుగా డిజైన్ చేసే ప్రాజెక్టులు ఎల్ల‌ప్పుడూ స‌క్సెస్ అవుతాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని భావించేవారికి స‌మూహా ప్రాజెక్ట్స్ ఈఎంఐ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నెల రోజుల్నుంచి న‌ల‌భై నెల‌ల్లో సొమ్ము చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించింది.

ప్లాటు ధర గజానికి రూ.6,500గా నిర్ణయించింది. అంటే, 200 గజాల ప్లాటుకు దాదాపు రూ.13 ల‌క్ష‌లౌతుంది. కేవ‌లం రూ. ల‌క్ష చెల్లించి ప్లాటు బుక్ చేసుకుని, మ‌రో ప‌దిహేను రోజుల్లో రూ.1.60 ల‌క్ష‌లు చెల్లించాలి. 20 శాతం సొమ్ము క‌ట్టిన త‌ర్వాత సేల్ అగ్రిమెంట్ రాసుకోవచ్చు. త‌ర్వాత నెల‌కు రూ.20 వేల చొప్పున చెల్లించాలి. ప్ర‌తి 10, 20, 30, 40వ నెల‌లో రూ.80 వేల చొప్పున ప్ర‌త్యేక ఈఎంఐ క‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి, ఇంత‌టి స‌దావ‌కాశాన్ని అందించే ప్రాజెక్టు స‌మూహా సంస్థ ఎక్క‌డ ప్రారంభించిందో తెలుసా? ఫార్మా కారిడార్ చేరువలోని ఇబ్రహీంపట్నం మరియు గున్గల్ మధ్యలో డెవలప్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ ఫార్మా కారిడార్ని డెవలప్ చేస్తోంది. సుమారు 19,333 ఎకరాల్లో అభిద్ధి చేస్తోన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా పారిశ్రామిక పార్కులో వెయ్యికి పైగా ఫార్మా కంపెనీలు ఏర్పాటవుతాయి. దాదాపు లక్ష కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ ఫార్మాహబ్లో ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల్ని తయారు చేస్తాయి. అంటే, ప్రపంచానికి కావాల్సిన ఔషధాలన్నీ ఇక నుంచి ఇక్క‌డే త‌యార‌వుతాయి.

9.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి..

తెలంగాణ ప్రభుత్వం అధికారిక అంచనాల ప్రకారం.. మన ఫార్మా కారిడార్ దాదాపు 9.7 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది. ఫలితంగా, 5.60 లక్షల మందికి కొత్త‌గా ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రపంచంలో పేరెన్నిక గల కన్సల్టెంట్లు ఇందులో ప్రపంచంలోనే అత్యుత్తమ రీతిలో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తున్నాయి. సుస్థిరమైన పారిశ్రామిక నగరాలుగా విర‌జిల్లేందుకు అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటిస్తున్నాయి.

సమీకృత సదుపాయలతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ మన దేశంలోనే అత్యంత ఆధునిక పారిశ్రామిక జోనుగా ప్రసిద్ధి చెందింది. పెట్టుబడిదారులు తమ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమయ్యే సౌకర్యాల్ని అందజేస్తోంది. ఈ క్రమంలో శుద్ధి సౌకర్యాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, వేడిని తగ్గించేందుకు సహజ వాయువు వాడకం వంటి వాటిని ఏర్పాటు చేస్తోంది. దీంతో, వాయు కాలుష్యాన్ని కనీస స్థాయికి తేవొచ్చు.

పరీక్ష సౌకర్యాల పర్యవేక్షణ, నియంత్రణ వంటివి సాధ్యమవుతాయి. ఫార్మా రంగానికి ప్రత్యేకంగా పనికొచ్చే విధంగా మాస్టర్ ప్లాన్ ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. సమగ్రమైన భౌతిక, పర్యావరణ, సామాజిక, సాంకేతిక మౌలిక సదుపాయల్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ పరిశ్రమ ఆర్థికంగా బలోపేతం అవుతుంది. రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలంలో రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఫార్మా సిటీ చేరువలో పెట్టుబడుల్ని పెట్టేందుకు రియల్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల వల్ల యాచారం అతి త్వరలో అతివేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఖ్యాతినార్జిస్తుంది.

తెలివైన పెట్టుబడి ఇదే..

ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్లాట్లు కొనుక్కోవడం తెలివైన మదుపరుల లక్షణం. అంతెందుకు, ప్రపథమంగా సొంతిల్లు కొనుక్కోవాలని భావించేవారికీ ఇదో చక్కటి ప్రాంతమని చెప్పొచ్చు. పైగా, భవిష్యత్తులో ఆశించిన దానికంటే అధిక లాభాల్ని ఆర్జించే అవకాశముంది. ప్రస్తుతం మనం ఊహించిన దానికంటే ధర తక్కువగా ఉండటంతో.. పెట్టే పెట్టుబడిపై ఊహించిన దానికంటే అధిక రాబడి గిట్టుబాటయ్యే అవకాశముంది. ఇక్కడ ప్లాట్లలో పెట్టుబడి పెట్టేందుకు, ఫ్లాట్లు, విల్లాల్ని కొనేందుకు సువర్ణావకాశమని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఫార్మా సిటీ గణనీయంగా వృద్ధి చెందడానికి అవకాశమున్న నేపథ్యంలో.. మీరు పెట్టుబడి పెట్టి.. మీ అదృష్టాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి.

లొకేషనే కీలకం..

ప్లాటు మీద పెట్టుబడి పెట్టాలంటే ఎవరైనా ముందుగా చూసేది లొకేషనే. సామాజిక మౌలిక సదుపాయాలెలా ఉన్నాయి? ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఎలా ఉంది? పని చేసే ప్రాంతాలకు ఎంత చేరువలో ఉంది? వంటి అంశాల్ని గమనిస్తారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే, హైదరాబాద్ ఫార్మా సిటీ అతి వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు.

ఒక కీలకమైన రెసిడెన్షియల్ హబ్ గా రూపాంతరం చెందుతోంది. ఫార్మా సిటీ చుట్టుపక్కల జరుగుతున్న అభివృద్ధి అందిపుచ్చుకుని, రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో సమూహా ప్రాజెక్ట్స్ దాదాపు ఐదు ప్రాజెక్టులను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఖ్యాతినార్జించేందుకు ఔటర్ రింగ్ రోడ్డే ప్రధాన చోదకశక్తి అని చెప్పొచ్చు. అందుకే, దీన్ని చుట్టూ పెట్టే ప్రతి పెట్టుబడికి మంచి రాబడి గిట్టుబాటు అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

భవిష్యత్తు హబ్ ఇదే..

హైదరాబాద్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి గోల్డెన్ గేట్ అత్యుత్తమ ఆప్షన్ అని చెప్పొచ్చు. డీటీసీపీ, రెరా అనుమతి గల ఈ లేఅవుట్ నాగార్జున సాగర్ హైవే మీద, ప్రతిపాదిత ఫార్మా సిటీ ముఖద్వారంలో ఏర్పాటు చేశారు. అంటే, అటు ఔటర్ రింగ్ రోడ్డు ఇటు రీజినల్ రింగ్ రోడ్డు నడిమధ్యలో.. హైదరాబాద్ ఫార్మా సిటీ గేటు వద్ద ఉంటుందన్నమాట. సుమారు డెబ్బయ్ ఎకరాల్లో విస్తరించిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సు థియేటర్, కమర్షియల్ కాంప్లెక్సు వంటివి అభివృద్ధి చేస్తారు.

గోల్డెన్ గేటు ప్ర‌త్యేక‌త‌లివే..

సమూహా ప్రాజెక్ట్స్ ఫార్మా కారిడార్ చేరువలోని యాచారంలో గోల్డెన్ గేటు అనే చూడచక్కటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ను డెవలప్ చేసింది. 70 ఎకరాల ఈ విశాలమైన వెంచర్లో ఇప్పటికే 80 శాతం ప్లాట్లను విక్రయించింది. ఒక్కసారి ఇందులోకి అడుగు పెడితే చాలు.. బ్లాక్ టాప్ రోడ్లు, దానికి ఇరువైపులా చెట్లు, చూడచక్కటి పచ్చదనంతో దర్శనమిస్తాయి. ఓవర్ హెడ్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్తు వంటివి సౌకర్యాలున్నాయి. అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రుల్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ వీలు కల్పించింది. ఆట స్థలాలు, వాకింగ్ ట్రాకులు చిన్నారులతో పాటు పెద్దల్ని ఆకట్టుకుంటాయి. 160 నుంచి 700 గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ధర.. చదరపు గజానికి రూ. 10,500గా నిర్ణయించింది. ఇందులోనే 16 ఎకరాల్లో సెకండ్ ఫేజ్ ను ప్రారంభించడానికి సమూహా ప్రాజెక్ట్స్ ప్రణాళికల్ని రచిస్తోంది.

కస్టమర్లలో సంతృప్తి

హైదరాబాద్లో ప్రాజెక్టుల్ని అనేక సంస్థలు అభివృద్ధి చేస్తాయి. కానీ, ఎంతమంది కొనుగోలుదారుల్ని సంతృప్తి చెందారనేది కీలకమైన అంశం. సమూహా ప్రాజెక్టులు అతివేగంగా పూర్తి కావడంతో కొనుగోలుదారుల్లో ఎక్కడ్లేని సంతోషం, సంతృప్తి కనిపిస్తుంది. ప్రపంచ స్థాయి సదుపాయాల్ని ప్రజలకు అందుబాటు ధరలోనే అందజేస్తూ హైదరాబాద్ మహానగరంలో అతివేగంగా అభివృద్ధి చెందిన సంస్థగా ఖ్యాతినార్జించింది. సంస్థ పూర్తి చేసిన ప్రాజెక్టులు, కొనుగోలుదారుల నుంచి వచ్చిన మద్ధుతే ఇందుకు నిదర్శనం.

చివ‌ర‌గా..

మధ్యతరగతి ప్రజానీకం అవసరాల్ని గుర్తించి.. వారి ఆలోచనలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల్ని తీర్చిదిద్దడంలో సమూహా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. అందుకే గత కొన్నేళ్ల నుంచి ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టును డెవలప్ చేస్తూ కొనుగోలుదారులకు సకాలంలో అందజేస్తోంది. సమూహా కుటుంబంలో చేరిన కొనుగోలుదారులు సంస్థ చేపట్టే కొత్త ప్రాజెక్టుల గురించి తరుచూ అడుగుతుంటారు. అంతేకాకుండా, తమకు తెలిసిన వారిని సమూహాలో కొనమని సూచిస్తుంటారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా, సమూహా అన్ని నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. కస్టమర్ సంతృప్తి చెందే వరకూ ఎక్కడా రాజీపడని తత్వాన్నిసమూహా సొంతం చేసుకుంది. అందుకే, మీరే మాత్రం ఆలోచించ‌కుండా స‌మూహా అభివృద్ధి చేస్తున్న గోల్డెన్ గేటుకు మీకు న‌చ్చిన ప్లాటు, ఫ్లాటు, విల్లాను నేడే సొంతం చేసుకోండి.

రెరా నెంబరు: P02400002122
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
http://www.samoohaprojects.com
ఫోన్ నెంబరు: 040-42613261
ఈమెయిల్: info@samoohaprojects.com
ప్లాటు నెంబరు- 18, ఫ్లాట్ నెంబర్ 301,
శ్రీనిధి నెస్ట్ అపార్టుమెంట్,
ఎస్బీఐ బ్యాంకు పక్కన, వైట్ ఫీల్డ్, కొండాపూర్, హైదరాబాద్.

 

దూరదృష్టి, సమర్థతే గీటురాయి

Mallikarjun Rao Kurra - Managing Director at Samooha projects Pvt Ltd
Mallikarjun Rao Kurra – Managing Director at Samooha projects Pvt Ltd

సమూహా ప్రాజెక్ట్స్ సంస్థను అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఎండీ మల్లికార్జున్ కుర్రా.. గోల్డెన్ గేట్ అనే మహత్తరమైన ప్రాజెక్టును ప్రారంభించారు. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతిష్ఠాత్మక టౌన్ షిప్పుగా తీర్చిదిద్దుతున్నారు. గత అవసరాల్ని అర్థం చేసుకుని, ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాల్ని ఆకళింపు చేసుకుని ప్రాజెక్టును ఆలోచనాత్మకంగా రూపొందించారు.

రియల్ రంగంలో దాదాపు పదహారేళ్ల అనుభవం గల మల్లికార్జున్ కుర్రాకి రియల్ రంగం భవిష్యత్తు అభివృద్ధిపై చక్కటి ఆలోచనలున్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులకు రూపకల్పన చేయడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారు. బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్లో దాదాపు నలభై అత్యుత్త‌మ‌ ప్రాజెక్టులను ఒంటి చేత్తో పూర్తి చేయడంలో వ్యూహాత్మక పాత్ర పోషించిన ఆయన.. సమూహా ప్రాజెక్ట్స్ ద్వారా పారదర్శకతతో కూడిన రియల్ వ్యాపారాన్ని నిర్వహించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. స్థల సేకరణ, ప్రాజెక్టు ఫండింగ్, డిజైనింగ్, అమ్మకాల్లో చక్కటి అనుభవమున్నది. పలు పేరెన్నిక గల రియల్ సంస్థల్లో నాయకత్వ బాధ్యతల్ని నిర్వర్తించి ఆయా సంస్థలు ఎదుగుదలలో క్రియాశీలక పాత్ర పోషించారు.

గత రెండు దశాబ్దాలుగా, విస్తారమైన పరిశ్రమ అనుభవంతో సమూహా సంస్థ అత్యంత విశ్వసనీయ డెవలపర్ గా పేరు సంపాదించింది. సంస్థలో అనుభవజ్ఞులైన సిబ్బందితో పాటు వినూత్న ఆలోచనలు గల యువకులు ఉండటంతో.. వినూత్న ఆలోచనల్ని అమలు చేయడానికి వీలు కలుగుతుంది. వీరంతా సంస్థ లక్ష్యాల్ని చేరుకునేందుకు కట్టుబడి ఉండటం వల్ల కొనుగోలుదారులకు ప్రపంచ స్థాయి నిర్మాణాల్ని అందించగల్గుతున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles