రియల్ ఎస్టేట్ గురుతో
ప్రముఖ నటి సయామీ ఖేర్
టేకు చెక్క, కళాఖండాలు మరియు మరిన్ని కళాఖండాలు..
వీటి గురించి ప్రముఖ నటి సయామీ ఖేర్‌కు చిన్నప్పట్నుంచి తెలిసినవి.
భద్రంగా దాచుకున్న మధురమైన జ్ఞాపకాలు. మరి, తన మొదటి నివాసం నుంచి
నేటివరకూ తన సొంతింటి గురించి రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా పంచుకున్నారు.
సారాంశం ఆమె మాటల్లోనే..
నా తల్లిదండ్రులు దేశం నలుమూలల నుంచి నాణ్యమైన టేకు కలపతో ఫర్నీచర్ డిజైన్ చేస్తారు. తయారు చేయడంతో పాటు ఎగుమతి కూడా చేస్తారు. అందుకే మా ఇల్లు ఎప్పుడూ ఓ ఫర్నీచర్ షోరూమ్ తరహాలో కనిపించేది. కానీ, వాటిని చూస్తే ఎంతో ముచ్చటేసేది. ఎంత చక్కగా వాటిని చెక్కేవారో! అవి అందంగా చెక్కిన కళాఖండాలుగా చెప్పొచ్చు.
అందమైన పెయింటింగులతో గోడను అలంకరించేవారు. శాస్త్రీయ భారతీయ సంగీతం మా ఇంటిని ఎంతో ప్రేమతో నింపింది. చిన్నతనంలో విలాసవంతమైన ఇంట్లో ఉన్నందు వల్ల పెద్దయ్యాక మినమలిస్టిక్ ఇంటి విధానంపై మక్కువ పెరిగింది. వృత్తిపరంగా ఎప్పుడూ బిజీనే. అందుకే, ఇంటికి రాగానే మనసు ప్రశాంతత కలగాలంటే కాస్త మినిమల్ ఫర్నీచర్ ఉంటే సరిపోతుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఎక్కడ ఆరంభించాలో నాకు తెలుసు.
This website uses cookies.