Categories: LEGAL

ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ కి ఎస్సీఆర్డీసీ షాక్..

    • కొనుగోలుదారుని డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశం

ఆదిత్య కన్ స్ట్రక్షన్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీఆర్డీసీ) షాక్ ఇచ్చింది. ఓ కొనుగోలుదారు విషయంలో కంపెనీ విధించిన నిబంధన సహేతుకంగా లేదని, వెంటనే సదరు ఫిర్యాదుదారు చెల్లించిన రూ.2 లక్షలను 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. బేగంపేటకు చెందిన కె. చంద్రశేఖర్ రెడ్డి తెల్లాపూర్ లోని ఆదిత్య సిలికాన్ హైట్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో తన కుమారుడు నవీన్ కుమార్ కోసం ప్రీలాంచ్ ఆఫర్ లో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందుకోసం రూ.2 లక్షలు చెల్లించారు.

అనంతరం ఆ ఫ్లాట్ ను తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా.. కంపెనీ అందుకు నిరాకరించింది. ఫ్లాట్ ను చంద్రశేఖర్ రెడ్డి పేరు మీదును బుక్ చేసుకున్నారని, ఒకవేళ నవీన్ కుమార్ పేరిటి రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.5 లక్షలు చెల్లించాలని షరతు విధించింది. ఇందుకు ఒప్పుకోకుంటే ఫ్లాట్ బుకింగ్ రద్దవుతుందని పేర్కొంది. దీంతో తాను చెల్లించిన రూ.2 లక్షలు వెనక్కి ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి కోరగా.. కంపెనీ నిరాకరించింది. దీంతో ఆయన జిలాల వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. ఆయన చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. దీనిపై ఆదిత్య కంపెనీ ఎస్సీఆర్డీసీకి వెళ్లగా.. అక్కడ కూడా ఫోరం తీర్పునే సమర్థిస్తూ తీర్పు వెలువడింది.

This website uses cookies.