Categories: LATEST UPDATES

హైదరాబాద్ లోనూ సెకండ్ హోమ్ ట్రెండ్

– అద్దె ఆదాయం కోసం రెండో ఇంటి వైపు పలువురి చూపు

సొంతింటి కల నెరవేర్చుకోవడానికే కాకుండా ఆదాయ ఆర్జనలోనూ రియల్ రంగం అక్కరకొస్తోంది. అద్దె ఆదాయం అందించే రెండో ఇంటి కోసం చూస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అద్దెలు భారీగా ఉండే బెంగళూరులో ఈ ఒరవడి ఎక్కువగా ఉండేది. తాజాగా ఇది హైదరాబాద్ కూ విస్తరించింది. సొంతిల్లు ఉన్నవారు అద్దె ఆదాయం కోసం రెండో ఇల్లు కొనుగోలు మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెలు బాగా వస్తుండటంతో రెండో ఇంటిని కొని అద్దెకు ఇవ్వాలని పలువురు యోచిస్తున్నారు. ఈఎంఐ మొత్తం అద్దె రూపేణా వచ్చే అవకాశం ఉండటంతో చాలామంది ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఇళ్లకు డిమాండ్ బాగా ఉంది. ఇక్కడ 2 బీహెచ్ కే ఇంటికి సగటున రూ.40 వేల వరకు అద్దె వస్తోంది. ఇతర ప్రాంతాల్లో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దెలు ఉన్నాయి. వాస్తవానికి గతంలో సొంతిల్లు ఉండేవారు.. స్థలాలు కొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్థిరమైన అద్దె ఆదాయం కోసం రెండో ఇల్లు కొంటున్నారు. అద్దె ఆదాయం పొందాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. తమ ఇంటి మీదే రెండు మూడు అంతస్తులు నిర్మించి వాటిని అద్దెకు ఇస్తుండేవారు. తాజాగా ఇది మరింత విస్తరించి రెండో ఇంటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.

This website uses cookies.