poulomi avante poulomi avante

రుణం చెల్లించనందుకు ఆస్తుల స్వాధీనం..

బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించనందుకు ఓ నిర్మాణ సంస్థకు చెందిన స్తిరాస్థులను సీజ్ చేశారు. ముంబైకి చెందిన సాయిఎస్టేట్ కన్సల్టెంట్  సంస్థ ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. దానికి సంబంధించి రూ.62.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు. దీంతో బ్యాంక అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం సాయి ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థకు చెందిన ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అడ్వొకేట్ సునీల్ పాండేను కోర్టు కమిషనర్ గా నియమించింది. చెంబూర్ లోని సింధి సొసైటీలో ఉన్న ప్రాపర్టీలు, భూమిని స్వాధీనం చేసుకోవాలని, అందుకు స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలని సూచించింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles