poulomi avante poulomi avante

షనాయ నివాసం.. నయనానందకరం

సమకాలీన గాంభీర్యం

అధునాతన సౌకర్యాల సమ్మిళతంగా
షనాయ కపూర్ ఇల్లు

నటి షనాయ కపూర్ తన కజిన్స్ జాన్వీ, అర్జున్, సోనమ్ కపూర్ అహుజాలతో కలిసి బాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె కేవలం పెరుగుతున్న ఓ స్లార్లెట్ మాత్రమే కాదు. ఆమె ఇప్పటికే జెన్-జెడ్ ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు కలిగి ఉన్నారు. అలాగే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. మీరు ఆమె ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్లలో ఒకరైతే.. ఆమె ఇంటిని మొత్తం చూడొచ్చు. షనాయ తొలుత నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ తో అందరి దృష్టినీ ఆకర్షించారు. అందులో ఆమె తన తల్లి మహీప్ కపూర్ తో కలిసి కనిపించారు. ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ప్రొఫైల్ ను పబ్లిక్ చేయడంతో.. తన జీవితంలో జరిగే చిన్నచిన్న ఘటనల నుంచి కుటుంబ విషయాలు, స్నేహితులతో హ్యాంగవుట్ల వరకు అన్నీ క్రమం తప్పకుండా పంచుకుంటున్నారు.

కరోనా ఆంక్షలు కొనసాగిన సమయంలో షనాయ తన తల్లిదండ్రులు మహీప్, సంజయ కపూర్, సోదరుడు జహాన్, ఆమె ప్రియమైన కుక్క టైగర్ తో కలిసి వారి విలాసవంతమైన ముంబై నివాసంలో సమయాన్ని ఎంతో చక్కగా గడిపారు. కపూర్ నివాసం సమకాలీన గాంభీర్యాన్ని, సౌకర్యం, అధునాతను ప్రతిబింబించే శైలుల మిళితంతో కనిపిస్తుంది. ఇక ఆమె లివింగ్ రూమ్ ఆహా అని అనిపించకమానదు. ఇంటికి గుండెగా అనిపిస్తుంది. బూడిదరంగు స్టీల్ కర్టెన్లతో ఉన్న ఖరీదైన కిటికీల నుంచి లోపలకు సహజమైన కాంతి ప్రసరిస్తుంది. సీక్విన్డ్, ప్యాటర్న్ కుషన్లతో తయారుచేసిన ఎల్ ఆకారంలో ఉన్న నల్లని సోఫా విశ్రాంతి తీసుకోవాలంటూ ఆహ్వానిస్తుంది. గ్లాస్ టాప్ తో ఉన్న కాఫీ టేబుల్, తాజా పుష్పాలు, మ్యాగజైన్లతో కూడి ఉన్న ప్రింటెడ్ సైడ్ టేబుల్ ఆ సీటింగ్ ప్రాంతాన్ని సంపూర్ణం చేస్తాయి. ఓ వుడెన్ టీవీ కన్సోల్ అద్భుతమైన వెండి బుద్ధ శిల్పంతోపాటు ప్రతిష్టాత్మకమైన ఆమె కుటుంబ ఫొటోలను ప్రదర్శిస్తుంది.

షనాయ కుటుంబం బార్ ఏరియా ముదురు చెక్క కేబినెట్ తోపాటు ఓ దృఢమైన టేబుల్ ను కలిగి ఉంది. దానిపై కాంస్య బొమ్మలు, క్రీమ్ మార్బుల్ కౌంటర్ టాప్ తో కనువిందు చేస్తాయి. ఆ సమీపంలోనే ఉన్న డైనింగ్ ఏరియాలో ఖరీదైన, కనులకు ఇంపైన షాండ్లియర్ కింద నిగనిగలాడే నల్లని గ్లాసీ టేబుల్.. చుట్టూ బూడిదరంగు వెల్వెట్ కుర్చీలు కలిసి వేడుకలు, సమావేశాలకు అనువైన ప్రదేశంగా కనిపిస్తుంది. ఇక షనాయ బెడ్ రూమ్ కు వెళితే.. డీప్ రెడ్ కలర్ తో కూడిన గోడ, దానితోపాటు స్కార్లెట్ ఫర్నిషింగ్స్ తో ఆకర్షిస్తుంది. తక్కువ ఎత్తున్న బెడ్, అధునాతన క్లొసెట్స్, నిలువుటద్దం, ఎర్రని షాండ్లియర్ ఆహా అనిపిస్తాయి. క్రీమ్ కర్టెన్లు పెద్ద కిటికీలకు పరదాగా మారాయి. ఇవి సహజమైన కాంతిని ఆ గది మొత్తం నింపుతాయి.

షనాయ విలాసవంతమైన అపార్ట్ మెంట్ అంతటా జాగ్రత్తగా క్యూరేట్ చేసిన మూలలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. బహుళ రంగు కుషన్లు, పూతపూసిన అద్దంతో అలంకరించిన క్రీమ్ బెంచ్ శైలి సోఫా ఎంతో విశ్రాంతిని ఇస్తుంది. అలాగే, ఫ్రేమ్డ్ ఫొటోగ్రాఫ్ లు, టప్టెడ్ లెదర్ కుర్జీలతో అలంకరించి ఉన్న అద్దంతో కూడిన సైడ్ టేబుల్ సేద తీరడానికి అనువైన స్థలం. మొత్తానికి షనాయ ఇల్లు అప్రయత్నంగా విలాసవంతమైన సౌందర్యంతో ఆధునిక భావాలను మిళితం చేస్తుంది. ఆమె యవ్వన స్ఫూర్తిని, అధునాతన అభిరుచిని ప్రతిబింబించే స్వర్గధామంగా కనిపిస్తుంది. ఆమె బాలీవుడ్ లో వెలుగొందడానికి సిద్ధమవుతున్నప్పుడు, షనాయ స్టైలిష్ అభయారణ్యం ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక సంగ్రహావలోకనం మాత్రమే కాకుండా వినోద ప్రపంచంలో ఆమె అభివృద్ధి చెందుతున్న ప్రయాణానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆమె అరంగేట్రంతోనే తన శక్తివంతమైన వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఇంటితో.. బాలీవుడ్ లో కొత్త తరం ప్రతిభ ఎలా ఉండబోతోందో తెరపై చూపిస్తూ.. అటు ఆన్ స్క్రీన్, ఇటు ఆఫ్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేసుకున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles