Categories: PROJECT ANALYSIS

ల‌గ్జ‌రీ ట్రిప్లెక్స్‌.. బ్రూక్‌వుడ్స్‌

ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌క్క‌నే గల స‌ర్వీస్ రోడ్డులో.. ఓ బ‌డా సైజు ల‌గ్జ‌రీ విల్లాల్లో నివ‌సించాల‌ని మీరు కోరుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోస‌మే అతిసుంద‌రంగా ట్రిప్లెక్స్ విల్లాల్ని శాంతాశ్రీరాం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ముస్తాబు చేస్తోంది. శాంతా శ్రీరాం బ్రూక్ వుడ్స్ ( Santa Shriram Brook Woods ) అని నామ‌క‌ర‌ణం చేసిన ఈ ప్రాజెక్టును ఆరు ఎక‌రాల్లో నిర్మిస్తోంది. ఇందులో వ‌చ్చే విల్లాల సంఖ్య‌.. 53. రెండు సైజుల్లో ట్రిప్లెక్స్‌ల‌ను ఆరంభించింది. 240 గ‌జాల్లో 3472 చ‌ద‌ర‌పు అడుగులు.. 344 గ‌జాల్లో ఐదు వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో డిజైన్ చేసింది. ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్ ఫేసింగులో.. జి ప్ల‌స్ రెండు అంతస్తుల ఎత్తులో క‌డుతున్న ఈ విల్లాను సొంతం చేసుకోవాలంటే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.7500 పెట్టాల్సి ఉంటుంది. అద‌నంగా మ‌రో రూ.10 ల‌క్ష‌లు అమెనిటీస్ కోసం క‌ట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును మ‌రో ఏడాదిన్న‌ర లోపు సంస్థ పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది.

ఆధునిక జీవ‌నాన్ని కోరుకునేవారికి ఈ ప్రాజెక్టు చ‌క్క‌గా న‌ప్పుతుంది. ల‌గ్జ‌రీ లైఫ్ స్ట‌యిల్ కోరుకునేవారి కోసం స‌మ‌కాలీన డిజైన్ల‌కు పెద్ద‌పీట వేసింది. ముఖ్యంగా ఆధునిక యువ‌త‌కు అన్నిర‌కాలుగా న‌చ్చేలా బ్రూక్ వుడ్స్ ప్రాజెక్టును శాంతాశ్రీరాం తీర్చిదిద్దింది. ప్ర‌తి విల్లాలోకి గాలీ, వెలుతురు ధారాళంగా వ‌చ్చేలా డిజైన్ చేసింది. వాస్తు సూత్రాల‌కు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ట్రిప్లెక్స్ కొంటే జీవ‌నం సాఫీగా కొన‌సాగుతుంది.

This website uses cookies.