ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఓ కళ. ఆర్కిటెక్ట్ ద్వారా పనులు పూర్తి చేయించడం దగ్గర నుంచి డెకర్ విషయంలో తమ ఎంపికలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రదర్శించడానికి చాలామంది ఉత్సుకత చూపిస్తారు. ప్రస్తుతం మనం అన్నింటా సూపర్ సక్సెస్ అయిన నటి శిల్పాశెట్టి దగ్గర ఉన్నాం. దుస్తుల దగ్గర నుంచి సినిమాలు లేదా రూ.కోట్లు విలువ చేసే ఆమె ఇల్లు కూడా అప్రయత్నంగా ఆడంబరాన్నే వెదజల్లుతుంది. ఇటీవల శిల్పాశెట్టి తన ఖరీదైన ఇంట్లోకి మమ్మల్ని తీసుకెళ్లారు. ముంబైలోని ఆమె నివాసం ఐశ్వర్యానికి పర్యాయపదంగా ఉంది.
అదో క్లాసీ హౌస్. బరువైన భారీ వుడెన్ డోర్లు కలిగిన లివింగ్ రూమ్ లోకి వెళ్లగానే.. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన అనేక పురాతన వస్తువులు కనిపించాయి. స్పెయిన్ నుంచి తెచ్చిన కళాఖండాలు, బ్రాస్ షాండ్లియర్, గార్డెన్ కనిపించేలా ఏర్పాటు చేసిన భారీ కిటికీలు, ఇంకా భారతీయ దేవతల భారీ విగ్రహాలు కనువిందు చేస్తాయి. ముంబై వంటి ఇరుకు నగరంలో ఇంత భారీ ఇంటిని కలిగి ఉండటం ఎంతో అదృష్టమని శిల్ప వ్యాఖ్యానించారు.
తాను బహిరంగ ప్రదేశాలను ఎందుకు ప్రేమిస్తారో ఎంతో ఉత్సాహంగా శిల్పాశెట్టి వివరించారు. గార్డెన్ ప్రాంతంలో తనకు ఇష్టమైన కార్నర్ చూపించి అక్కడ తాను నాటిన చెట్ల గురించి చెప్పారు. అలా ఆరుబయట కూర్చుంటే.. అలల సవ్వడి వినగలరని, అక్కడంతా తాను ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉందని పేర్కొన్నారు. ‘నేను ఈ స్టార్ ఫ్రూట్ చెట్టును ఇక్కడ నాటాను. ఓ రోజు నేను రోజూ ఇక్కడ కూర్చుంటానని, ఈ చెట్టు నీడలో సేద తీరతానని, దీని పండ్లు నా తలపై ఉంటాయని ఊహిస్తూ ఉంటాను. మీరు మీ కలలన్నింటికీ, అలాగే కష్టాలన్నింటికీ ఆర్కిటెక్ట్ అని వారు అంటున్నారు. నేను ఊహించిన విధంగా ఇది నిజంగానే నిజమైంది’ అని తెలిపారు.
ఇక ఆ ఓపెన్ స్పేస్ లో భారీ తోటతోపాటు హాయిగా ఉండే ఇండోర్, ఔట్ డోర్ సిటవుట్ ఏరియా ఉంటుంది. సూపర్ ఫిట్ గా ఉండే శిల్ప.. ప్రతిరోజూ తన తోటలో ఉదయాన్నే యోగా చేస్తూ చాలా సమయం గడుపుతూ తన శరీరానికి అవసరమైన డి విటమిన్ పొందుతారు. ఇక ఇంట్లో ఇంకా ముందుకు వెళితే.. ఆ ఇంటి థీమ్ ప్రశాంతత, నిశ్చలతను ప్రతిబింబిస్తుంది. ఇది స్వతహాగా ఏదైనా ప్రదర్శించాలనే కోరికకు సంబంధించింది కాదు, కానీ అంతర్లీనంగా ఉన్నవాటిని ప్రతిబింబించే సామర్థ్యం ఇంటికి ఆ సానుకూలతను తెస్తుంది.
This website uses cookies.