ప్రాజెక్టులకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వనందుకు 16వేల మందికి పైగా బిల్డర్లకు రెరా నోటీసులు జారీ చేసింది. రెరా చట్టం సెక్షన్ 11 ప్రకారం రెరాలో రిజిస్టర్ చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన సమస్త వివరాలను ప్రతి మూడు నెలలకు ఓసారి అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, పలువురు బిల్డర్లు వాటిని నమోదు చేయకపోవడంతో మహారాష్ట్ర రెరా చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది జనవరిలో దాదాపు 19,500 ప్రాజెక్టులకు నోటీసులిచ్చింది.
అయితే, అందులో దాదాపు 16వేల ప్రాజెక్టులకు సంబంధించిన బిల్డర్లలో కొందరు అస్సలు స్పందించకపోగా.. మరికొందరు అరకొర వివరాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో వారందరికీ షోకాజ్ నోటీసులు పంపించింది. ఈ మేరకు వారికి ఈ మెయిల్ చేసింది. 15 రోజుల్లో వాటికి స్పందించి, తగిన వివరాలు ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ నోటీసులకు కూడా స్పందించకపోతే రెరా చట్టం ప్రకారం తీవ్రమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
This website uses cookies.