Categories: LATEST UPDATES

హౌసింగ్ సొసైటీల కన్వేయన్స్ డీడ్స్?

ఓ ప్రాపర్టీ యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి సంబంధించిన కీలకమైన పత్రాల్లో కన్వేయన్స్ డీడ్ ను చాలా హౌసింగ్ సొసైటీలు పట్టించుకోవడంలేదు. మహారాష్ట్రలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం 1,15,172 హౌసింగ్ సొసైటీలు ఉండగా.. అందులో 71,444 సొసైటీలకు కన్వేయన్స్ డీడ్స్ లేవని తేలింది. అంటే దాదాంపు 60 శాతానికి పైగా సొసైటీలు ఈ కీలకమైన చట్టబద్ధ పత్రాన్ని పొందలేదు. గతేడాది డిసెంబర్ వరకు 2,990 కన్వేయన్స్ డీడ్ ప్రతిపాదనలు రాగా.. 2028 ప్రతిపాదనలు పరిష్కరించినట్టు మహారాష్ట్ర కో ఆపరేటివ్ హౌసింగ్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.

మరో 962 ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్ని హౌసింగ్ సొసైటీలూ కన్వేయన్స్ డీడ్స్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని వార్డులు, తాలూకా కార్యాలయాలు ప్రైవేటు ఫెడరేషన్ల సాయం తీసుకుని సొసైటీలు కన్వేయన్స్ డీడ్స్ రిజిస్టర్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. నెలకు కనీసం వార్డు లేదా తాలూకా స్థాయిలో కనీసం 50 సొసైటీల రిజిస్ట్రేషన్ జరగాలని స్పష్టంచేసింది. నిబంధనల ప్రకారం సొసైటీని రిజిస్టర్ చేసుకున్న కొత్త భవనాలు నాలుగు నెలల్లోగా కన్వేయన్స్ డీడ్ పొందాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా వాటికి నోటీసులు ఇస్తారు

This website uses cookies.