ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) తన ప్రాజెక్టు అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. దక్షిణ గురుగ్రామ్ లో ఇటీవల ఆ కంపెనీ లాంచ్ చేసిన డాక్సిన్ విస్టాస్ లో రూ.2300 కోట్ల ప్రాపర్టీలను కేవలం పది రోజుల్లోనే విక్రయించి ఔరా అనిపించింది. ‘సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు మధ్య 10 రోజుల వ్యవధిలో డాక్సిన్ విస్టాస్ ప్రాజెక్టులో రూ.2,300 అమ్మకాలు జరిపాం. ఈ ప్రాజెక్టు ప్రీమియం, మధ్య ఆదాయవర్గాల హౌసింగ్ అనే రెండు కీలక విభాగాలు కలిగి ఉంది’ అని సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ రజత్ కతురియా చెప్పారు. డాక్సిన్ విస్టాస్ లో ఇండస్ట్రియల్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి.
దక్షిణ గురుగ్రామ్ లో ని సోహ్నా ఎలివేటెడ్ కారిడార్ సమీపంలో 125 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఇందులో ఇండిపెండెంట్ ఫ్లోర్స్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి. కాగా, నెలవారీ ప్రాతిపదికన సిగ్నేచర్ గ్లోబల్ గత 9 నెలల్లో సగటున నెలకు రూ.వెయ్యి కోట్ల మేర అమ్మకాలు సాగిస్తున్నట్టు రజత్ వివరించారు. ‘మేం మొదటి ఆరు నెలల్లో దాదాపు రూ. 5,900 కోట్ల అమ్మకాలను సాధించాము. గత తొమ్మిది నెలల్లో రూ.9వేల కోట్ల మేర అమ్మకాలు జరిపాం’ అని తెలిపారు. గత కొన్ని త్రైమాసికాల్లో కంపెనీ అద్భుతమైన పనితీరు నమోదు చేసిందని చెప్పారు. 2024 క్యూ2లో రూ.19.92 కోట్ల నష్టంతో పోలిస్తే.. 2025 క్యూ2లో రూ.4.15 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్టు వివరించారు.
This website uses cookies.