Categories: LATEST UPDATES

గ్రీన్ ప్రాజెక్టుల్లో గణనీయమైన పెరుగుదల

దేశంలో గ్రీన్ ప్రాజెక్టుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. గత దశాబ్ద కాలంలో ఈ విషయంలో చక్కని పురోగతి నమోదైంది. ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్), ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో గ్రీన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు బాగా పెరిగాయి. 2011లో మొత్తం రియల్ ప్రాజెక్టుల్లో ఇవి 24 శాతం ఉండగా.. 2021 నాటికి 31 శాతానికి ఎగబాకాయి. 2011లో 80 మిలియన్ చదరపు అడుగుల లోపు ఈ ప్రాజెక్టులు ఉండగా.. 2021 మూడో త్రైమాసికానికి ఏకంగా 177 శాతం పెరిగి 212 మిలియన్ చదరపు అడుగులకు చేరాయి.

2012 నుంచి 2016 మధ్య కాలంతో పోలిస్తే.. గత ఐదేళ్లలోనే ఇవి మరింత పెరిగాయి. అంటే భారత రియల్ ఎస్టేట్ రంగం ఈఎస్ జీ (పర్యావరణం, సామాజికం, పరిపాలన) విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని అర్థమవుతోంది. ఇక ఈ విషయంలో హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉంది. ఎన్ సీఆర్, హైదరాబాద్ లు 44 శాతం వాటాతో టాప్ లో ఉండగా.. చెన్నై 37 శాతం, ముంబై 16 శాతం, పుణె 15 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

This website uses cookies.