Categories: LATEST UPDATES

ఆటోమెటిక్‌గా తెరుచుకునే స్మార్ట్ రూఫ్‌లు..

ఇంటి డిజైన్లలో సరికొత్త మార్పులు

కాలానుగుణంగా ఇంటి డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఫ్లోరింగ్ నుంచి ఇంటి పై కప్పు వరకు అన్నీ స్మార్ట్ మయం అవుతున్నాయి. కాలంతోపాటే కొత్తగా, ఆకట్టుకునే రీతిలో ఎన్నో డిజైన్లు వస్తున్నాయి. రూఫ్ లు కూడా సరికొత్తగా, అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నాయి. కారు కోసం షెడ్ అవసరమైనప్పుడు తెరుచుకునేలా.. వద్దనుకున్నప్పుడు మూసుకునేలా వస్తున్నాయి. ఒక్క స్విచ్ తో ఆటోమేటిక్ గా తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతుంది. ఇలాంటి రూఫ్ ఉంటే.. చలికాలంలో ఎండ కోసం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. వర్షం పడుతుంటే మూసేసుకోవచ్చు.

ప్రస్తుతం అవుట్ డోర్ లో అల్యూమినియం వాడకం పెరిగింది. కొన్నిచోట్ల స్టెయిన్ లెస్ స్టీల్, గ్లాస్ కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిని ఒకసారి ఏర్పాటు చేస్తే మళ్లీ మార్చడం కుదరదు. ఈ నేపథ్యంలో రూఫ్ లు కూడా స్మార్ట్ రూపు సంతరించుకున్నాయి. మన ఇంటి బయట ఉన్న స్థలాన్ని గరిష్టంగా వినియోగించుకునేలా, కాలానుగుణంగా మార్చుకునేలా ఉంటున్నాయి. అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసిన రూఫ్ లు ఒక స్విచ్ నొక్కగానే కర్టెన్ మాదిరిగా తెరుచుకుంటాయి. వద్దనుకున్నప్పుడు మూసేసుకోవచ్చు. కావాల్సిన ఆకృతిలో ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు. ఇంటి పోర్టికోలో ఏర్పాటు చేసిన ఈ రూఫ్ ను ఉదయం, సాయంత్రం ఎండ కోసం తెరుచుకోవచ్చు. మధ్యాహ్నం ఎండ పడకుండా మూసుకునే వెసులుబాటు ఉంటుంది. స్విమింగ్ పూల్ వద్ద మనకు కావాల్సిన విధంగా వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా ఇంటి రంగులకు తగినట్టుగా అల్యూమినియం పైకప్పులకు పౌడర్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు.

This website uses cookies.