హైదరాబాద్ నగరానికి చెందిన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్రత్యేకత ఏమిటో తెలుసా.. తొలుత ప్రాజెక్టు నిర్మాణం మీద దృష్టి పెడుతుంది. అందులోని టవర్లు అడ్వాన్స్ స్టేజీకి వచ్చాకే అమ్మకాల మీద అధిక ఫోకస్ చేస్తుంది. వాస్తవానికి, ఇలాంటి సంస్థలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పొచ్చు. అందుకే, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎక్కడ ప్రాజెక్టును ఆరంభించినా తమ ప్రత్యేకతను చాటి చెబుతుంది. ఆ నిర్మాణం చేపడుతున్న ప్రాంతానికే సరికొత్త వన్నె తేవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలోని ఎనిమిదో టవర్ అయిన హ్యామిల్టన్‌ను హ్యాండోవర్ చేయడానికి సంస్థ ప్రణాళికల్ని రచిస్తోంది.
నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం గల ఎస్ఎంఆర్ హోల్డింగ్స్.. అత్యుత్తమ నాణ్యత గల నిర్మాణాల్ని కొనుగోలుదారులకు అందిస్తుందనే ఖ్యాతినార్జించింది. కొనుగోలదారుల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల్ని డిజైన్ చేయడంలో ఎల్లప్పుడు ముందంజలో ఉంటుంది. ఈ సంస్థ వద్ద ఫ్లాట్లు కొనేవారికి ఆశించినదానికంటే అధిక అప్రిసియేషన్ లభిస్తుంది. తాజాగా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ హ్యామిల్టన్ అనే ప్రీమియం టవర్‌ను ఈ డిసెంబరులో హ్యాండోవర్ చేయడానికి ప్లాన్ చేసింది. సుమారు రెండు క్లబ్ హౌజుల్ని ఈ ప్రాజెక్టులో డెవలప్ చేస్తున్నారు. వీటి విస్తీర్ణం ఎంతలేదన్నా లక్షా ఇరవై వేల చదరపు అడుగులు ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా మినీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో నివసించే రెసిడెంట్స్ కోసం విడిగా ఒక టెంపుల్‌ని డెవలప్ చేస్తున్నారు.
ఎస్ఎంఆర్ ఎండీ రాంరెడ్డి స్పెషాలిటీ ఏమిటంటే.. ఆయన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విషయంలో ఏమాత్రం రాజీపడరు. కొంత స్థలం దొరికితే చాలు.. ఒక టవర్ కట్టొచ్చని భావించే బిల్డర్లున్న ప్రస్తుత తరుణంలో.. ఆయన మాత్రం అందులో ఒక కొత్త సౌకర్యాన్ని పొందుపరిస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. అలా ఆయన ట్రెండీ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన సరికొత్త ఐడియానే.. క్రికెట్ ప్రేమికుల కోసం ఎక్స్‌క్లూజివ్ క్రికెట్ గ్రౌండ్ ను.. ఈ ప్రాజెక్టులో పొందుపరుస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి బయట గార్డెన్స్‌లో కూర్చోని పని చేసుకునే విధంగా ప్రాజెక్టును మొత్తం తీర్చిదిద్దారు. కొండాపూర్ ఏరియా ప్రత్యేకత ఏమిటంటే సౌతిండియాలోనే అత్యంత బెస్ట్ అండ్ ప్రీమియ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ్నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులతో పాటు ఎయిర్‌పోర్టుకు కూడా ఎంతో సులువుగా చేరుకోవచ్చు.
ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో ఆరంభంలో కొనుగోలు చేసిన ప్రాపర్టీ కొనుగోలుదారులు మంచి అప్రిసీయేషన్‌ని అందుకున్నారు. ఇందులో ఫ్లాట్లను చదరపు అడుక్కీ రూ.3300 నుంచి 3600 మధ్యకొన్నవారు సుమారు మూడు రెట్లు అప్రిసియేషన్‌ను అందుకున్నారు. స్థిర నివాసం కోసం ఏర్పాటు చేసుకునేవారే ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లను తీసుకోవడం విశేషం. మరి, మీరు కూడా ఒకసారి ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను సందర్శించండి. ప్రీమియం టవర్ అయిన హ్యామిల్టన్‌ను కళ్లారా చూడండి. మీకు నచ్చితే ఇక ఏమాత్రం ఆలోచించకుండా.. అందులో ఫ్లాట్లను ఎంచుకోండి.
This website uses cookies.