Hyderabad's Smr Vinay City Elected its new managing commitee unanimously
మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ (స్కోవా) లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో.. అధ్యక్షుడిగా కింగ్ జాన్సన్ కొయ్యడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్కోవా ఎన్నికల సంఘం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు జాన్సన్ మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల నుంచి మెయింటనెన్స్ పెంచకుండా.. అభివృద్ధి పనుల్ని చేపట్టడం వల్ల నివాసితులు తమపై పూర్తిగా నమ్మకం ఉంచారని తెలిపారు. ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా కమ్యూనిటీని తీర్చిదిద్దుతామని అన్నారు. కోశాధికారి ఎం. నవీన్ మాట్లాడుతూ.. రెసిడెంట్స్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. వచ్చే రెండేళ్లు పలు అభివృద్ధి పనుల్ని చేపడతామని చెప్పారు.
వీరే నూతన కమిటీ సభ్యులు: అధ్యక్షుడు: కింగ్ జాన్సన్ కొయ్యడ, ఉపాధ్యక్షుడు: హిమాన్షు, ప్రధాన కార్యదర్శి: సురేష్, కార్యదర్శి: సతీష్ వావ్‌ధానే, జాయింట్ సెక్రటరీ: దీపక్ ఖత్రీ, ట్రెజరర్: ఎం నవీన్, జాయింట్ ట్రెజరర్: అంకుర్ అగర్వాల్. ఇతర కమిటీ సభ్యులుగా సింధూరి, మధుమితా నాయక్, ధనుంజయ్ పాణిగ్రహీ, అర్దెందు శేఖర్ దాస్, కె హిమబిందు, నితిన్ మిశ్రా, ఆనంద్ పాండే, సామ్యూల్ బీరా ఎన్నికయ్యారు.
This website uses cookies.