బాలీవుడ్ ప్రముఖ నటి సోనమ్ కపూర్ ముంబైలోని తన లగ్జరీ అపార్ట్ మెంట్ ను విక్రయించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న ఆ ఇంటిని ఢిల్లీకి చెందిన ఎస్ఎంఎఫ్ ఇన్ ఫ్రాస్టక్చర్ రూ.32.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. 4,610 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఈ సూపర్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును 2015లో సోనం రూ.31.48 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు.
కాగా, సోనమ్ ఇంటిని కొనుగోలు చేసిస సంస్థ స్టాంపు డ్యూటీగా రూ.1.95 కోట్లు చెల్లించింది. ఈ లావాదేవీ గతనెల 29న జరిగింది. ఈ ప్రాజెక్టులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు అపార్ట్ మెంట్లు ఉన్నాయి. డీల్ లో భాగంగా ఎస్ఎంఎఫ్ ఇన్ ఫ్రాస్టక్చర్ కు నాలుగు కారు పార్కింగులు లభిస్తాయి. కార్పెట్ ఏరియాతోపాటు ఈ అపార్ట్ మెంట్ కు అనుసంధానంగా ఉన్న కొంత ఓపెన్ ఏరియా కూడా ఈ సంస్థకే లభిస్తుంది. నిజానికి 2020లోనే ఈ ప్రాపర్టీ కొనుగోలు కోసం సదరు సంస్థ సోనమ్ ను సంప్రదించింది. అనందరం ఆమెతో ఒప్పందం చేసుకుంది.