హైదరాబాద్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తన బ్రాండ్ ప్రచారం కోసం బ్రోచర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఇందుకోసం తొలుత నటి కాజల్ అగర్వాల్ ను సంప్రదించారు. అయితే, ఓ గంట కార్యక్రమం కోసం ఆమె ఎక్కువ మొత్తం డిమాండ్ చేయడంతో ఆ అవకాశం మరో నటి శ్రీలీలకు దక్కినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కోసం కాజల్ రూ.15 లక్షలతోపాటు బోర్డింగ్, లాడ్జింగ్ డిమాండ్ చేసినట్టు సమాచారం. కాజల్ తన పాపులారిటీ, బ్రాండ్ విలువను దృష్టిలో ఉంచుకుని భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, రెమ్యునరేషన్ తగ్గింపు విషయంలో ఆమె మేనేజర్ తగ్గలేదని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తి ఒకరు వెల్లడించారు. దీంతో సదరు సంస్థ మరో నటి శ్రీలీలను ఎంపిక చేసుకుని ఆమెను సంప్రదించినట్టు సమాచారం. ఆమెకు రూ.12 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా శ్రీలీల హైదరాబాద్ లోనే ఉండటం వల్ల కంపెనీకి బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు ఉండవు. కాజల్ బదులు శ్రీలీలను ఎంపిక చేసుకోవడం వల్ల కంపెనీకి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదా అయిందని సదరు వ్యక్తి వివరించారు.
This website uses cookies.