టైగర్ రిజర్వులు, నేషనల్ పార్కులు, అభయారణ్యాల కోర్ ఏరియాల్లో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలూ చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. టైగర్ రిజర్వులు, నేషనల్ పార్కుల్లో జూ, సఫారీల ఏర్పాటుతో విభేదించింది. నేషనల్ పార్కుల్లో సఫారీల ఆవశ్యకతను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథార్టీ (ఎన్ టీసీఏ)ను ఆదేశించింది.
ఈ మేరకు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తరాఖండ్ లోని కోర్బెట్ టైగర్ రిజర్వులోని బఫర్ ఏరియాలో టైగర్ సఫారీ ఏర్పాటుతోపాటు పలు అక్రమ నిర్మాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు టైగర్ రిజర్వులు, నేషనల్ పార్కులు, అభయారణ్యాల్లోని నోటిఫైడ్ కోర్ ఏరియాలలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దని స్పష్టంచేసింది.