Categories: LATEST UPDATES

అక్రమ నిర్మాణాలపై ఉన్న‌త స్థాయి కమిటీ

  • మంత్రి తలసాని

అగ్ని ప్రమాదానికి గురైన నిర్మాణాలు వంటివి హైదరాబాద్లో 25 వేల వరకూ ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వీటిని రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదన్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ నెల 25న ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. అందులో కూలంకషంగా చ‌ర్చిస్తామ‌న్నారు.

ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యత పై నిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క‌మిటీ త్వ‌ర‌లోనే నివేదిక‌ను స‌మ‌ర్పిస్తుంద‌న్నారు. దాన్ని ఆధారంగా త‌గు చ‌ర్య‌ల్ని తీసుకుంటామ‌ని తెలిపారు. డబ్బుల కోసం అక్రమ కట్టడాలు క్రమబద్దీ కరిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నార‌ని.. త‌మ హాయంలో ఒక్క భవనాన్ని కూడా రేగులరైజ్ చేయలేద‌న్నారు. భవనాల క్రమబద్ధీకరణ పథకంపై హైకోర్టు స్టే ఉన్నదని కిషన్ రెడ్డికి తెలియదా అంటూ ఎద్దేవా చేశారు.

This website uses cookies.