తమన్నా భాటియా.. తెలుగు ప్రేక్షకులకు ఈ మిల్క్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈ కలర్ ఫుల్ భామకు రంగులంటే చాలా ఇష్టం. ఆమె ఇంటి లోపల చూస్తే అది కనిపిస్తుంది. విశాలమైన ఆమె గదిలోకి ప్రవేశిస్తే.. కళాత్మక ప్రపంచంలో అడుగు పెట్టినట్టుగా ఉంటుంది. గోడపై వేలాడుతున్న బుధ పెయింటింగ్ చూస్తే ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. అయితే, విభిన్నమైన ఫర్నిచర్ మీకు సమకాలీన వెచ్చదనాన్ని అందిస్తాయి. అలాగే లేత రంగులతో కూడిన గోడలు తాజా అనుభూతిని కలిగిస్తాయి.
తండ్రి కట్టించిన ఆ ఇంట్లో తమన్నా గత ఎనిమిదేళ్లుగా నివసిస్తున్నారు. ఒక వ్యక్తి ఉండే పరిసరాలు వారి వ్యక్తిత్వాన్ని తెలియజేయడం నిజమే అయితే.. ఆధునిక ట్రెండ్ ను ఇష్టపడే వ్యక్తి తమన్నా అని చెప్పొచ్చు. అదే సమయంలో ఆమెలో కొంత మేరకు సంప్రదాయపు ఇష్టాలు కూడా కనిపిస్తాయి. ఆమె గదిలో ఉన్న పురాతన వస్తువుల్లో ఇది ప్రతిఫలిస్తుంది. ఇక తమన్నా తన గదిలోని సోఫాలో కూర్చుని ఒక చేతిలో పుస్తకం.. మరో చేత్తో తన పెంపుడు శునకంతో ఆడుకుంటూ విశాలమైన గాజు కిటీకీ నుంచి బయటకు చూస్తూ ఆస్వాదించడాన్ని ఆమె బాగా ఎంజాయ్ చేస్తారు.
లేలేత రంగులు, టెక్స్చర్డ్ గోడలు, ఫ్లోర్స్ చూస్తే.. అటు అందం, ఇటు సింప్లిసిటీకి నిదర్శనంగా కనిపిస్తాయి. ఇక పాతకాలపు ఫర్నిచర్ తమన్నా ఇంటికి వెచ్చని అనుభూతిని జోడిస్తుంది. గోడలపై ఉన్న కళాత్మక కాన్వాస్.. హాయి గొలిపేలా ఉండగా, చిన్నచిన్న మూలల్లో ఏర్పాటు చేసిన అద్దాలు ఆ గది అందానికి మరింత వన్నెలద్దాయి. అలాగే ఆమె వంటగది కూడా చాలా మినిమలిస్టిక్, ఇంకా క్లాసీగా కనిపిస్తుంది.
ఇక తమన్నా తన తల్లిదండ్రులతో కలిసి చాలా దగ్గరగా కూర్చుని టీ తాగుతూ, సరదాగా కబుర్లు చెప్పుకోవడం కోసం అక్కడ ఓ త్రిభుజాకార టేబుల్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మిల్క్ బ్యూటీ బెడ్ రూంలోకి వెళ్లాలంటే ఆ గదికి వెలుపల ఉన్న మేకప్ వేసుకునే ప్రదేశం నుంచి వెళ్లాలి. తమన్నా అక్కడే చాలాసేపు గడుపుతారు. అది చాలా చిన్న ప్రదేశమే అయినప్పటికీ.. అది సినిమా నటుల ఇల్లు అని చెప్పే కీలకమైన స్థలం అన్నమాట. అద్దాలు, మెరిసే రంగులు అక్కడ ప్రతిబింబిస్తాయి.
అక్కడి వార్డ్ రోబ్ లో చాలా బ్రష్ లు కనిపిస్తాయి. అది దాటి వెళితే.. తమన్నా బెడ్ రూం వస్తుంది. అక్కడ బెడ్ పై తమన్నా కుటుంబంతో కూడిన భారీ చిత్రం ఉంటుంది. బెడ్ రూం బయట ఉన్న ప్రదేశానికి పూర్తి భిన్నంగా బెడ్ రూం లోపల కనిపిస్తుంది. టెక్స్చర్ లోనూ, డెకర్ లోనూ పూర్తి వైవిధ్యం కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఇదీ మన మిల్క్ బ్యూటీ ఇల్లు.
This website uses cookies.