Categories: TOP STORIES

రెరా పరిధిలోకి.. 2017 కంటే ముందు ప్రాజెక్టులు

ఇళ్ల కొనుగోలుదారులకు ఊరట కలిగించేలా తమిళనాడు రెరా అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని రెరా చట్లం అమల్లోకి రావడానికి కంటే ముందు నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫిర్యాదుల్ని సైతం పరిష్కరించాలని నిర్ణయించింది. తమిళనాడులో రెరా చట్టం 2017 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, రెరా చట్టం అమల్లోకి రాక ముందు నిర్మించిన ఓ ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన ఫిర్యాదును పరిష్కరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెరా చట్టంలోని మూడో సెక్షన్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెరా అధికారి శరవణన్ తెలిపారు.

అమర్ ప్రకాష్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ చెన్నై శివార్లలో టెంపుల్ వేవ్స్ అనే ప్రాజెక్టును చేపట్టింది. 2015 నవంబరులోపు ఫ్లాట్లను స్వాధీనం చేస్తామని ప్రకటించింది. దీంతో, ఇద్దరు వ్యక్తులు రూ.40 లక్షల చొప్పున చెల్లించి రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అయితే చెప్పిన తేదీకి ఫ్లాట్ నిర్మాణం పూర్తి కాలేదు. మళ్లీ 2017 నాటికి అందేస్తామని హామీ ఇచ్చింది. కానీ, చివరకూ 2018లో అప్పగించడానికి ఇరు వర్గాల్ని పిలిచింది. అయితే, ఆ ఫ్లాటులో చాలా లోటుపాట్లు కనిపించాయి. దీంతో, వారు సదరు సంస్థపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలించిన రెరా అథారిటీ.. 2017 కంటే ముందు నిర్మించిన ప్రాజెక్టులపై వచ్చే ఫిర్యాదుల్ని పరిష్కరించాలని నిర్ణయించింది.

కేటీఆర్ ఎమన్నారంటే?

తెలంగాణ రెరా అథారిటీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. 2017 కంటే ముందు రాష్ట్రంలో కట్టిన నిర్మాణాలన్నీ రెరా పరిధిలోకి వస్తాయని.. కాకపోతే, అంతకంటే ముందు నిర్మించిన ప్రాజెక్టుల్లో నెలకొనే సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాకపోతే, ఆయా సమస్యను క్షుణ్నంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 2017 తర్వాత కట్టిన ప్రాజెక్టుల్లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడం లేదు.. పాత ఫ్లాట్లలో ఇబ్బందుల్నేం తీర్చుతారని ఇళ్ల కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు.

This website uses cookies.