2024 తొలి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు అదుర్స్
హైదరాబాద్ లో 38 శాతం పెరుగుదల
దేశంలో రియల్ ఎస్టేట్ రంగం జోరుగా దూసుకెళ్తోంది. ఇళ్లకు డిమాండ్ బలంగా కొనసాగుతుండటంతో ఈ ఏడాది మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి. 2024 జనవరి-మార్చి త్రైమాసికంలో 1,30,170 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 1,13,775 ఇళ్లు అమ్ముడయ్యాయి. ముంబై, పుణె, బెంగళూరు, హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా.. ఢిల్లీ, చెన్నై, కోల్ కతాల్లో తగ్గాయి. నగరాలవారీగా చూస్తే.. ముంబైలో 24 శాతం వృద్ధితో 42,920 యూనిట్లు, పుణెలో 15 శాతం పెరిగి 22,990 ఇళ్లు, హైదరాబాద్ లో 38 శాతం పెరుగుదలతో 19,660 యూనిట్లు, బెంగళూరులో 14 శాతం అధికంగా 17,790 ఇళ్లు అమ్ముడయ్యాయి.
ఇక ఢిల్లీలో ఇళ్ల విక్రయాలు 9 శాతం తగ్గి 15,650 యూనిట్లు, కోల్ కతాలో అమ్మకాలు 9 శాతం క్షీణించి 5,650 యూనిట్లు, చెన్నైలో 6 శాతం తగ్గి 5,510 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 10 శాతం నుంచి 32 శాతం మేర పెరిగినట్టు అనరాక్ వెల్లడించింది.
This website uses cookies.