రియల్ ఎస్టేట్ గురుతో నటి తేజస్వి
నిపుణులైన ఇంటీరియర్ డిజైన్ల సహాయంతో.. వారు అందించే అత్యుత్తమ సూచనలతో తన ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలని టాలీవుడ్ నటి తేజస్వి మదివాడ భావిస్తోంది. తను కేవలం ఒక ఇంటిని సొంతం చేసుకోవడంతోనే పరిమితం కాదలుచుకోలేదు. వీలైనంత ఎక్కువ ఆస్తుల్ని సంపాదించాలని అంటోంది. అందర్ని ఆశ్చర్యపరిచే విధంగా, ఆమె తన జాబితాలో కలల గృహం గురించి అనేక ఆప్షన్లను కలిగి ఉంది. తన ఇల్లు వావ్ అనిపించే విధంగా మ్యాజిక్ చేసేందుకు ఆమె సిద్ధమవుతోంది. దీని బట్టి, తేజస్వి ఇంటీరియర్‌లు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. “జీవిత శాశ్వతత్వంపై నాకు నమ్మకం లేదు, కాబట్టి కలల ఇల్లు తాత్కాలికంగా కదిలే ప్రదేశాలలో ఎందుకు ఉండకూడదు. ఎప్పుడైనా కలల ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకుంటే నా దృష్టి నా రంగురంగుల గోడలపై ఉంటుంది. నా కలల ఇంటిని స్ప్లాషి రంగులతో అందంగా తీర్చిదిద్దాలని ఉంది. మొదటి సారి బొటనవేలును రంగుల సముద్రంలో ముంచితే విభిన్నమైన షేడ్లను చూడొచ్చు. అలాంటి షేడ్ల నుంచి స్ఫూర్తి పొంది ఇంటిని డిజైన్ చేస్తే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
అడవి అయినా ఓకే..
ప్రపంచంలో ఎక్కడైనా కలల గృహాన్ని కట్టుకుంటానని అంటోంది. ఎవరైనా విక్రయిస్తే అడవిలో సైతం కొనేందుకు సిద్ధమంటోంది. ”అడవిలో అయితే ప్రకృతిలో నివసిస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. పైగా, సమకాలీన రీతిలో అందంగా అలంకరించుకోవచ్చు. నాకు నగరాల్లో ఇల్లంటే అస్సలు ఇష్టం లేదు, ప్రకృతి మధ్యలో సహజమైన అభయారణ్యం, నిర్మాణం దాని వాతావరణంలో సజావుగా కలిసిపోయే ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. సుస్థిరమైన రీతిలో ఇల్లు కట్టుకోవడం కొత్త ట్రెండ! ఇంటి అంతటా, కలప నా స్వంత ఆహారాన్ని పెంచుకోవడంతో పాటు నాకు స్టైలిష్ నివాస స్థలాన్ని సృష్టిస్తుంది. నా పెంపుడు జంతువులు నా ఇంటికి మరింత రంగును జోడిస్తాయి.”
ఒకవేళ ఇంటి ఎంపికలో ఆప్షన్ లభిస్తే.. పర్వతాలు లేదా లోయలలో కలల ఇంటిని కట్టుకుంటానని చెబుతోంది. తన సొంత కారణాల ప్రకారం.. బీచ్ విల్లా కోసం ఎప్పటికీ వెళ్లనని చెబుతోంది. ఒకవేళ తాను పర్వతాల నడుమ ఇల్లు కట్టుకుంటే.. తనను కలిసేందుకు వచ్చేవారు ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుందని నవ్వుతూ చెప్పింది. పర్వతాల మీదుగా ఫిల్టర్ చేసే కనీస సహజ కాంతిని ఆస్వాదిస్తానని అంటోందీ ఐస్ క్రీమ్ నటి. ఎకో-ఫ్రెండ్లీ ఆర్కిటెక్చర్ లేదా అడవిలో లోతుగా ఉన్న ఇల్లంటే తనకు ఇష్టమని అంటోంది. ప్లాస్టిక్ రహిత అలంకరణ ఉండాలని చెబుతోంది. బయో-డిగ్రేడబుల్ ఫర్నిచర్ వినియోగించాలని వివరిస్తోంది. సేంద్రీయ వ్యవసాయంపై మక్కువ చూపెడుతోందీ యువ నటి.
డిజైనర్ తప్పనిసరిగా కావాలి
ఇంటీరియర్ డిజైనర్ సాయం తీసుకోవడం కీలకమన భావిస్తోందీ బిగ్ బాస్ కంటెస్టెంట్. “బయట మార్కెట్‌లో ఏదైనా ఫ్యాషన్ అయిపోయిన తరుణంలో నా డెకర్ మారుతూ ఉంటుంది. ఇంటీరియర్ డిజైనర్ ఆలోచనలు లేకుండా, కలల ఇల్లు ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. హైదరాబాద్‌లోని నా స్నేహితుడు రానా దగ్గుబాటి ఇల్లంటే నాకు అమితమైన ప్రేమ. కన్హా నేషనల్ పార్క్‌లో కొన్ని ఆస్తులున్నాయని తెలుసు. వాటి గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు. ఇప్పటివరకూ నేను చూసిన ఉత్తమ ఆస్తి అని చెప్పొచ్చు.”