డబుల్ బెడ్ రూం అందని, భూమి ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోవడం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల కుటుంబాలకు ఈ సాయం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఈ లెక్కన 119 నియోజకవర్గాల్లో 3.57 లక్షల కుటుంబాలను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారు.
మిగిలిన 43వేల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపిక చేసి సాయం అందిస్తారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హౌసింగ్ రంగానికి రూ.12వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ లో ఇది రూ.11వేల కోట్లుగా ఉంది. కాగా, పేదలకు ఇళ్ల కోసం రూ.3లక్షలు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ మండిపడింది. వాస్తవానికి భూమి ఉన్న పేదలకు ఇళ్ల కోసం రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు దానిని రూ.3 లక్షలకు కుదించడం దారుణమని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
This website uses cookies.