Categories: LATEST UPDATES

ఆర్ఆర్ రేట్లు పెంచొద్దు

  • మహారాష్ట్ర సర్కారుకు క్రెడాయ్ నాసిక్ వినతి

రెడీ రెకోనర్ (ఆర్ఆర్) రేట్లను ఈ ఏడాది పెంచొద్దని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నాసిక్ చాప్టర్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆర్ఆర్ రేట్ల ఆధారంగానే స్థిరాస్తి కొనుగోలుదారుల నుంచి స్టాంపు డ్యూటీని సర్కారు వసూలు చేస్తుంది. ప్రతి ఏటా ఈ రేట్లను సవరించి, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తుంది. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లల రియల్ రంగం తీవ్రంగా ప్రభావితమైనందున, ఈ ఏడాదికి ఆర్ఆర్ రేట్లు పెంచొద్దని క్రెడాయ్ నాసిక్ కోరింది.

‘కరోనాకు తోడు స్టీల్, సిమెంట్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇలాంటి తరుణంలో ఆర్ఆర్ రేట్లు పెంచితే ప్రాపర్టీ ధరలు కూడా పెరుగుతాయి. అది అంతిమంగా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపిస్తుంది’ అని క్రెడాయ్ నాసిక్ అద్యక్షుడు రవి మహాజన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్ఆర్ రేట్లను గతేడాది ప్రభుత్వం పెంచింది.

ప్రస్తుతం నాసిక్ లో 1000 ప్రాజెక్టుల్లో 45వేల ఫ్లాట్ల నిర్మాణ దశలో ఉన్నాయని.. మరో 1500 ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయని సీనియర్ ఆర్కిటెక్ట్ నీలేష్ చవాన్ తెలిపారు. అలాగే గత కొన్ని రోజులుగా ఇళ్ల కొనుగోలు కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని.. ఈ క్రమంలో ఆర్ఆర్ రేట్లు పెంచితే తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

This website uses cookies.