నిబంధనలకు విరుద్ధంగా రెరాలో ప్రాజెక్టు నమోదు చేయకుండా అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు డెవలపర్లపై తెలంగాణ రెరా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు హస్తిన రియల్టీ, సొనెస్ట ఇన్ ఫ్రా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కడ్తాల్ ఫార్మాసిటీలోని బ్రిస్సా ప్రాజెక్టులో హస్తిన రియల్టీ ప్లాట్లు విక్రయిస్తోంది. అలాగే సొనెస్ట ఇన్ ఫ్రా సంస్థ గచ్చిబౌలిలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేపట్టింది. దీంతో ఆ రెండు సంస్థలకు రెరా నోటీసులు జారీచేసింది. వారం రోజుల్లోగా రెండు కంపెనీల ప్రతినిధులు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
రెరా చట్టం, 2016 ప్రకారం ప్రతి ప్రమోటర్ తన ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయాలి. రెరాలో నమోదు చేయకుండా వాటికి సంబంధించి వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, ప్లాట్లు అమ్మడం లేదా అమ్మకానికి ఉన్నట్టు ఆఫర్ చేయడం వంటివి చేయకూడదు.
This website uses cookies.