మిద్దె సాగు ఎలా చేయాలనే అంశంపై ఈనెల 23 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు హైదరాబాద్ లోని ఉద్యాన శిక్షణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మిద్దె ఎంపిక, ఎంత లోడ్ వేయవచ్చు అనే విషయాలతోపాటు మిద్దె నమూనా ప్లాన్, కుండీల ఎంపిక, మొక్కల ఎంపిక, జీవన సేంద్రియ పద్ధతిలో సాగు ఎలా చేయాలి, కీటక-తెగుళ్ల నివారణ, పంట కోత ఎలా చేయాలి, మట్టి మిశ్రమం ఎలా తయరుచేయాలి, నీటి యాజమాన్యం, వేసవికాలం కూరగాయల సాగు ఎలా చేయాలి అనే అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్టు ఉద్యానశాఖ డైరెక్టర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ సంస్థలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9705 384 384 నంబర్ కు కాల్ చేయాలని పేర్కొన్నారు.
This website uses cookies.