Categories: PRESS RELEASE

ల్యాండ్ స్కేప్ డిజైన్  విజేత స్మృతి బాల్వల్లి

ఇండియన్ సొసైటీ ఆఫ్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్స్ (ఐఎస్ఓఎల్ఏ)తో కలిసి హైదరాబాద్ కు చెందిన ఎస్. జైపాల్ రెడ్డి ఫౌండేషన్ నిర్వహించిన అఖిల భారత మెమోరియల్ ల్యాండ్ స్కేప్ డిజైన్ పోటీలో స్మృతి బాల్వల్లి విజేతగా నిలిచారు. మొత్తం 60 మందికి పైగా ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్స్ ఈ పోటీలో పాల్గొనగా.. స్మృతి వేసిన డిజైన్ అత్యుత్తమంగా ఉందని ఐఎస్ఓఎల్ఏ ఎంపిక చేసింది. విజేతగా నిలిచిన ఆమె రూ.3 లక్షల నగదు గెలుచుకున్నారు. అవార్డుకు ఎంపికైన డిజైన్ ను కాంగ్రెస్ దివంగత నేత ఎస్. జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ వద్ద ఇటీవల ఆవిష్కరించారు. ల్యాండ్ స్కేప్ ఆర్టిటెక్చర్ లో దాదాపు పదేళ్ల అనుభవం ఉన్న స్మృతి.. ఫ్రీలాన్సింగ్ ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్ గా, బెంగళూరులోని ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఆర్టిటెక్చర్ లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అమెరికాకు చెందిన డిజైనర్, శిల్పి మాయా యింగ్ లిన్ వేసి వియత్నాం మెమోరియల్ అవార్డు గెలుచుకోవడంతో సమకాలీన మెమోరియల్ ల్యాండ్ స్కేప్స్ పూర్తిగా రూపాంతరం చెందాయని స్మృతి అభిప్రాయపడ్డారు.

This website uses cookies.