Categories: TOP STORIES

జీహెచ్ఎంసీలో.. 44 అంతస్తుల ”ద ఒలంపస్”

జీహెచ్ఎంసీలో అత్యంత ఎత్త‌యిన రెసిడెన్షియ‌ల్ ట్విన్ ట‌వ‌ర్ల ప్రాజెక్టు ” ద ఒలంప‌స్ ” ( The Olympus ) ను సగర్వంగా ఆరంభిస్తున్నామ‌ని సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ తెలిపారు. వాస‌వి గ్రూపుతో క‌లిసి నాన‌క్‌రాంగూడ‌లో ద ఒలంపస్ ప్రాజెక్టును ఆవిష్క‌రించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వేవ్ రాక్ పక్కనే ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండటం వల్ల నడుచుకుంటూ ఆయా సంస్థలకు చేరుకోవచ్చని తెలిపారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఆహ్లాదకరమైన జీవితం కోరుకునే వ్యక్తులు , కుటుంబాల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఒలంపస్ ప్రాజెక్టును తీర్చిదిద్దామని చెప్పారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాజెక్టులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేవారికి స‌రికొత్త అనుభూతిని ఇస్తుంద‌న్నారు.

సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో ఆరంభించిన ద ఒలంపస్ ప్రాజెక్టును 5.06 ఎకరాల్లో నానక్ రాంగూడలో నిర్మిస్తున్నామని.. ఇందులో మొత్తం 854 లగ్జరీ ఫ్లాట్లు వస్తాయన్నారు. ఇందులో 3 నుంచి 5 పడక గదుల ఫ్లాట్లు ఉంటాయని.. 1600 నుంచి 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడతామన్నారు. ఇది హైదరాబాద్లోనే ఐకానిక్ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. ఐదు పార్కింగ్ ఫ్లోర్లు ప్లస్ 44 అంతస్తుల ఎత్తులో ట్విన్ రెసిడెన్షియల్ టవర్లను కడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల భారతదేశం నుంచే కాకుండా ప్రవాసులు అధిక స్థాయిలో మన వద్ద పెట్టుబడుల్ని పెడుతున్నారని వివరించారు.

రూ.2000 కోట్ల పెట్టుబడితో..

ద ఒలంపస్ నిర్మాణానికి రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ఇందులో మేం పెట్టేది సుమారు రూ.500 కోట్లు. దీనికి అదనంగా.. వచ్చే 2-3 ఏళ్లలో హైదరాబాద్, బెంగళూరు ప్రాజెక్టుల్లో రూ.1500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. కొండాపూర్, ఎయిర్ పోర్టు రోడ్డులో కొత్తగా రెండు ప్రాజెక్టుల్ని ఆరంభిస్తున్నాం. ఇక్కడా ఆఫీసు, వాణిజ్య సముదాయాల్ని డెవలప్ చేయాలన్న ఆలోచనలున్నాయి. దక్షిణాది మార్కెట్లలో రూ.25 నుంచి రూ. 45 లక్షల్లో అందుబాటు గృహాల్ని నిర్మించే ప్రణాళికలున్నాయి.

This website uses cookies.