హైదరాబాద్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి చెలరేగింది. ఇరు పార్టీల ఆధిపత్యపు పోరులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. దాన్ని ప్రభావం రియల్ రంగం మీద పడకూడదు. సొంత ఇల్లు కొనుగోలు చేయాలని భావించేవారు.. రాజకీయాల్ని చూసి సొంతింటి కొనుగోళ్లను వాయిదా వేయకూడదు. ఈ రెండు అంశాల్ని వేర్వేరుగా చూస్తూ.. ఇంటి ఎంపికకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. కనీసం ఈ వినాయక చవితి నుంచి అయినా.. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న విఘ్నాలన్నీ తొలగిపోయి.. ఇళ్ల అమ్మకాలు పెరిగి.. రియల్ మార్కెట్ మూడు పూవులు ఆరు కాయలతో విరజిల్లాలి.