Categories: PROJECT ANALYSIS

అదిరింది ‘వ్యూ’ బ‌య్య‌ర్లు ‘క్యూ’

  • పుప్పాలగూడలో అల్ట్రా ప్రీమియం హైరైజ్ ప్రాజెక్టు
  • ద వ్యూ రెసిడెన్సెస్..
  • 10 ఎక‌రాలు.. 7 ట‌వ‌ర్లు.. 1154 ఫ్లాట్లు
  • ముచ్చ‌టైన మూడు మార్గాలు

ఫైనాన్షియల్ జిల్లా ఐటీ హబ్ కు అతి సమీపంలోని చక్కని ప్రదేశంలో మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల‌ని భావిస్తున్నారా? అయితే, పుప్పాల్‌గూడలో అదిరిపోయే ప్రాజెక్టు ఆరంభ‌మైంది. ఆ లొకేష‌న్ చూస్తే ఎవ‌రైనా ఎగిరి గంతేయాల్సిందే. అందుకే, చాలామంది వ్యూ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనేందుకు క్యూ క‌డుతున్నారు. మ‌రి, ఈ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త‌లేమిటో తెలుసుకుంటే.. మీరు కూడా క్యూ క‌ట్టేస్తారు.

పుప్పాలగూడలో అదిరిపోయే రేంజ్ లో రూపుదిద్దుకుంటున్న అల్ట్రా ప్రీమియం హైరైజ్ ప్రాజెక్టు.. ద వ్యూ రెడిసెన్సెస్. 10 ఎకరాల సువిశాలమైన స్థలంలో అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్, ఓపెన్ ఏరియాతో ఈ ప్రాజెక్టును అత్యంత సుందరంగా డిజైన్ చేశారు. మొత్తం 7 టవర్లలో 1154 అల్ట్రా ప్రీమియం 3, 4 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. మూడు రోడ్ల జంక్షన్ లో ఉన్న ఈ ప్రాజెక్టును ఉన్నతస్థాయి ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. అటు ప్రైవసీ, ఇటు వెంటిలేషన్ కోసం అంతస్తుకు కేవలం 6 యూనిట్లు మాత్రమే ఉండేలా డిజైన్ చేశారు. 1500 చదరపు అడుగుల నుంచి 2600 చదరపు అడుగుల మధ్యలో 3 బీహెచ్ కే, 3510 చదరపు అడుగుల నుంచి 3975 చదరపు అడుగుల మధ్యలో 4 బీహెచ్ కే ఫ్లాట్లు ఉన్నాయి.

* సౌకర్యాల పరంగా కూడా ఈ ప్రాజెక్టు అత్యద్భుతంగా ఉంది. సువిశాలమైన క్లబ్ హౌస్ తోపాటు కాఫీ లాంజ్, రెస్టారెంట్లు, బార్, స్విమ్మింగ్ పూల్, బాంకెట్ హాల్, జిమ్నాజియం, ఇండోర్ గేమ్స్, ఏరోబిక్స్ రూం, మల్టీపర్సస్ హాల్, ప్రతి ఫ్లోర్ కూ గెస్ట్ లాబా, సీసీ టీవీ కెమరాలు, పిల్లల ఆట స్థలం, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, కమ్యూనిటీ ఎంట్రన్స్ గేట్, శాండ్ పిట్, బాడ్మింటన్ కోర్టు, లాన్, ఔట్ డోర్ టెన్నిస్ కోర్టులు, ఈవెంట్ స్పేస్, ఏంఫిథియేటర్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఇంకా వాటర్ సాఫ్టెనింగ్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి వ్యవస్థ, ఇంకుడు గుంతలు, ప్రతి ఫ్లాట్ కు సెంట్రలైజ్డ్ గ్యాస్ బ్యాంకు నుంచి ఎల్పీజీ సరఫరా, పార్కింగ్ నిర్వహణ, కార్ వాషింగ్ సౌకర్యం, 100 శాతం పవర్ బ్యాకప్ కూడా ఉంది.

* లొకేషన్ పరంగా కూడా ఈ ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం విశేషం, రెండే రెండు నిమిషాల డ్రైవ్ తో అటు ఓఆర్ఆర్ కు, ఫైనాన్షియల్ జిల్లాకు వెళ్లొచ్చు. రెండు కిలోమీటర్ల పరిధిలో 20 ఐటీ పార్కులు, 13 స్కూళ్లు, 4 ఆస్పత్రులు ఉన్నాయి. మణికొండ, హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా చక్కని కనెక్టివిటీ కలిగి ఉండటం మరో విశేషం. రెరా అనుమతి ఉన్న ఈ ప్రాజెక్టును నిర్మాణ రంగంలో 36 ఏళ్ల అనుభవం ఉన్న రఘురాం మ‌రియు ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలు క‌లిసి నిర్మిస్తున్నాయి. బోలెడు అనుకూలతలు, మరెన్నో సౌకర్యాలతో కూడిన ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ ధర చదరపు అడుగుకి రూ. 6,836 నుంచి రూ.8,083 గా నిర్ధారించారు. అంటే దాదాపుగా రూ.1.04 కోట్ల నుంచి రూ.2.76 కోట్ల మధ్యలో ఫ్లాట్లు లభిస్తాయి. 2025 డిసెంబర్ కు ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంద‌ని సంస్థ తెలియ‌జేస్తుంది.

This website uses cookies.